Breaking News

30/04/2019

ఏపీ కాంగ్రెస్ కు పునర్జీవం వచ్చేనా

గుంటూరు, ఏప్రిల్ 30, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు. ఈరెండింటిలో ఒక పార్టీ మాత్రమే అధికారంలోకి రానుంది. అయితే ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు మాత్రం ఒక పార్టీకి మాత్రం పూర్తి శాపంగా మారనున్నాయి. అదే జాతీయ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయింది. ఒక్క స్థానం గెలుచుకోగ పోగా డిపాజిట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు దక్కేలేదు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత తగ్గింది. అయినా సరే ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పూర్తిగా బలం కోల్పోవడంతో ఈసారి కూడా సేమ్ రిజల్ట్ వచ్చే అవకాశాలున్నాయి.ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేత చెప్పించింది. సీడబ్ల్యూసీలో తీర్మానం చేసింది. మ్యానిఫేస్టోలో కూడా పెట్టింది. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో కలసి నడవాలని చివర వరకూ ప్రయత్నించింది. 


ఏపీ కాంగ్రెస్ కు పునర్జీవం వచ్చేనా

అంతకు ముందే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే అందులో తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. అయితే అక్కడ సత్ఫలితాలు రాలేదు చంద్రబాబునాయుడు ఏపీలో కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు సుముఖత చూపలేదు. రాహుల్ గాంధీ సయితం పొత్తుల విషయంలో చంద్రబాబు ఇష్టాలకే వదిలేశారు. కాంగ్రెస్ కు బహిరంగంగా చంద్రబాబు మద్దతివ్వడంతో జాతీయస్థాయిలో అవసరమైతే టీడీపీ స్నేహహస్తం చాస్తుందని భావించిన రాహుల్ పొత్తు లేకుండానే బరిలోకి దిగాలని ఏపీసీసీ నేతలకు చెప్పడంతో పార్టీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీంతో అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కిశోర్ చంద్రదేవ్, కోట సూర్య ప్రకాశ్ రెడ్డి లాంటి నేతలు కూడా పార్టీని వదిలి వెళ్లడంలో ఉన్న కొద్దో గొప్పో క్యాడర్ లోనూ నైరాశ్యం ఆవహించింది. ఎన్నికల సమయంలో ఇది స్పష్టంగా కన్పించింది.ఇక పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేస్తారన్నది ప్రశ్నగానే మారింది. ఆయన కల్యాణదుర్గం నుంచి బరిలోకి దిగారు. అక్కడ గెలుపు రఘువీరారెడ్డికి అంతసులువు కాదు. కాంగ్రెస్ లో మిగిలి ఉన్న సీనియర్ నేతలు అతి కొద్ది మందిలో రఘువీరా ఒక్కరు. మరో ఐదేళ్లు పార్టీని రాష్ట్రంలో నడపడం కష్టమే. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కొద్దో గొప్పో ఊరట. అదీరాకుంటే మాత్రం ఏపీలో కాంగ్రెస్ దుకాణం మూసేయాల్సిందేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్నాయి. రఘువీరారెడ్డి కూడా ఇక పార్టీకి సేవ చేసే ఉద్దేశ్యంలో లేరని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కూడా ఆయన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మే 23వ తేదీ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కొంత క్లారిటీవచ్చే అవకాశముంది

No comments:

Post a Comment