Breaking News

30/04/2019

విశాఖలో కనుమరగువుతున్న ఉద్యానవనాలు

విశాఖపట్టణం, ఏప్రిల్ 30,(way2newstv.in)
వైజాగ్ వాసులకు ఆనందం కరువువుతోంది. సరదాగా కొంచెం సేపు ఆటవిడుపుగా ఎంజాయ్ చేద్దామంటే...పార్కుల్లో కష్టమే. సాయంత్ర వేళల్లోనూ, ఆదివారాలప్పుడు పిల్లలతో హాయిగా కాసేపు ఊరడిల్లడానికి పార్కులు ఎంతో అవసరం. జివిఎంసి ఎన్నో కోట్లు ఖర్చు చేసి పార్కులను అభివృద్ధి పరుస్తున్నారు. ఎంతో ప్రఖాతి ఉన్న ముడసర్లోవ పార్కుని వదిలేశారు. ఈ ఉద్యానవనానికి సహజ అందాలు పెట్టని కోట. పార్కుకి సమీపంలో ఎలాంటి కాలుష్యం లేకపోవడం ప్రత్యేకత కాగా, చుట్టూ పెట్టని కోటవలె పచ్చని కొండలు, మధ్యలో రిజర్వాయర్‌తో అలరాడుతుంది. విశాఖ బృందావనం అని పిలుచుకునేంతగా ఇక్కడ వరుసగా అశోక వృక్షాలు దర్శనమిస్తున్నాయి. హుదూద్‌ తుఫాన్‌కు ఈ అశోక చెట్లు చెక్కు చెదరలేదు. ఇదే రిజర్వాయర్‌లో ఒకప్పుడు బోటింగ్‌ కూడా ఉండేది. ఈ ఉద్యానవనానికి అనుబంధంగా రోజ్‌ గార్డెన్‌, స్నేక్‌ పాత్‌వే వంటివి అభివృద్ధి చేసినా, ఇప్పుడు మచ్చుకు అనవాలు లేవు. గతంలో విశాలమైన స్థలం, వేల మందికి సరిపడే వసతి సౌకర్యాలు ఉండేవి. అలాగే కొన్నాళ్ళ పాటు పక్లులు, మొసళ్ళ ఎన్‌క్లోజర్లతోను, నీటి ఫౌంట్లేన్లతో కళకళలాడేది. 


విశాఖలో కనుమరగువుతున్న ఉద్యానవనాలు

కార్తీక మాసం వస్తే చాలు నగరం నలుమూలల నుండి భారీగా సందర్శకులు వచ్చేవారు. పిల్లలు ఆడుకునేందుకు అనుగుణంగా పార్కులో ఆటస్థలం, ఆట పరికరాలు భారీగా ఉండేవి. ప్రస్తుతం ఆట పరికరాలు పింపురు పట్టి మూలకు చేరాయి. లోపలు చెట్లు చుట్టూ నిర్మించే పగోడాలు శిథిలావస్థకు చేరాయి. లోపలి దారులు, భవనాలు పూర్గిగా పాడైపోయాయి. రెండు అతిథి గృహాలు బూత్‌ బంగ్లాలను తలపిస్తున్నాయి. రిజర్వాయర్‌ను వీక్షించడానికి గట్టుపై నిర్మించిన షెడ్ల పెకప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. ఎటు చూసినా పనికి రాని చెట్లతో కళాహీనంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు ఈ ఉద్యాన వనాన్ని అభివృద్ధి చేస్తే సందర్శకులే కాదు పర్యావరణ ప్రేమికులు సంతోషిస్తారు ముడసర్లోవ రిజర్వాయర్‌, ఉద్యానవనం ఇప్పుడు వెలవెలబోతోంది. అలాంటి ఉద్యానవనం దశాబ్దాల కిందటి వరకు వేలాది మంది సందర్శకులతో కళకళలాడేది. ప్రస్తుతం దీని పరిస్థితి ధీనవస్థలో ఉంది. సందర్శకులు రాక కళహీనంగా ఉంది. సందర్శకులు వచ్చినా ఇది పాత ఉద్యానవనమేనా, ఇక్కడ ఎలా సేద తీరాలి అనుకుంటూ వెనక్కు వెళ్ళిపోవడం మినహా మరో మార్గం లేదంటున్నారు ఇక్కడికి వచ్చిన సందర్శకులు. ముడసర్లో రిజర్వాయర్‌కు అనుబంధంగా అభివృద్ధి చేసిన ఈ ఉద్యానవనం ఒకప్పుడు నగరంలోని అత్యధికులతో పాటు నగరానికి వచ్చిన సందర్శకులు కూడా ఈ పార్కుని సందర్శించిన స్థలంగా వర్ధిల్లింది. అధికారుల పుణ్యమా అని ప్రస్తుతం సందర్శకులు ముడసర్లోవ పేరు కూడా తలచుకోలేని పరిస్థితికి వచ్చేసింది. బిఆర్‌టిఎస్‌ రోడ్డు అభివృద్ధి చేయడంతో ఈ పార్కుకు మహర్ధశ పడుతుందని అందరూ భావించారు. అందుకు భిన్నంగా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. హుదూద్‌ తుఫాన్‌ దాటికి ఇది పూర్తిగా దెబ్బతిన్న ఈ పార్కుని పునరుద్ధరణ మాటేలేదు. ఇటీవల ముడసర్లోవ రిజర్వాయర్‌తో పాటు పార్కుని అభివృద్ధి చేసేందుకు ఉడా రోజుకో ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆ ప్రణాళికలు ప్రకటనల వరకే తప్పా కార్యరూపం దాల్చే దాఖలాలు లేవు.

No comments:

Post a Comment