నంద్యాల, ఏప్రిల్ 29 (way2newstv.in)
తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల టౌన్ మోడల్ హాల్ నందు ప్రజాదర్బార్ ( గ్రీవిన్స్) కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ పఠాన్ శెట్టి రవి శుభాష్ , జేసీ 2 మణిమాల తో కలిసి కలెక్టర్ ప్రజల వద్దనుండి ఫిర్యాదులను స్వీకరించారు. పరిష్కరించదగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి : కలెక్టర్
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సమస్యలున్న గ్రామాల్లో ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటికి ఇబ్బందులుండరాదన్నారు. అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. వలసలను అరికట్టాలన్నారు. ముక్యంగా అన్ని మండల కేంద్రాల్లో, ప్రధాన కూడళ్లలో, ఎంపీడీవో, తహశీల్దార్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో నారాయణమ్మ, డ్వామా , డిఆర్డీఏ పీడీలు వెంకట సుబ్బయ్య, రామకృష్ణ, తదితర జుల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment