Breaking News

29/03/2019

ఆరుగురు కొత్తవారికి టీడీపీ టికెట్లు

చిత్తూరు,మార్చి 29,(way2newstv.in):
సొంత జిల్లాలో టిక్కెట్ల కేటాయింపులో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను కొత్త ముఖాలను  ఆయన ఈ సారి ఎన్నికల బరిలో దించారు. ఒక వైపు బలమైన ప్రత్యర్ధులు, మరోవైపు అనుభవం లేని నేతలు. మరి ఈ ప్రయోగం టీడీపీకి కలిసి వస్తుందా. ప్రత్యర్ధులను మట్టికరిపిస్తుందా.. సొంత జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయ నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటారని చంద్రబాబుకి పేరు. సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకోబోయే ముందు  ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని జిల్లా నేతలు చెబుతుంటారు.  ఈసారి చంద్రబాబు కొత్త ప్రయోగం చేశారు. 


ఆరుగురు కొత్తవారికి టీడీపీ టికెట్లు

చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో .. తొలిసారి టీడీపీ నుంచి ఆరుగురు కొత్తవాళ్లు బరిలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో  ఆరు కొత్త ముఖాలకు టీడీపీ చోటు  కల్పించడం చర్చనీయాంశంగా మారింది.నగరి స్థానం నుంచి గాలి భాను ప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయవారసుడిగా తొలిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తిచేసిన  భానుప్రకాష్, విదేశాల్లోనే కొంతకాలం ఉద్యోగం చేశారు. 2009, 2014 ఎన్నికల సమయంలో తండ్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు చేదోడు వాదోడుగా ఉన్నారు. తండ్రి మరణంతో ఆయన వారసుడిగా ప్రత్యక్ష  రాజకీయాల్లో దిగుతున్నారు. స్వయంగా తల్లి సరస్వతమ్మ, తమ్ముడు గాలి జగదీష్ నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను అధిగమించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు భానుప్రకాశ్. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాజకీయంగా బలమైన వైసీపీ అభ్యర్ధి రోజాను ఆయన ఈ ఎన్నికల్లో ఢీకొంటున్నారు.

No comments:

Post a Comment