Breaking News

19/03/2019

ఘర్షణలకు పాల్పడితే కేసులు

కాకినాడ, మార్చి 19 (way2newstv.in): 
మంచి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తూర్పు గోదావరి  జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రజలను కోరారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రావులపల్లి గ్రామంలో సిఐ రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఓటర్ల  అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. 


ఘర్షణలకు పాల్పడితే కేసులు

ముందుగా కాట్రావులపల్లి లోని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో ఎస్.పి విషాల్ గున్ని ముచ్చటించారు  అనంతరం మంచి వాతావరణం లోని ప్రజలు ఓటు హక్కు కలిగిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు.  ఎటువంటి ఘర్షణలకు ఓటు వేసేటప్పుడు పాల్పడవద్దని అలా జరిగితే కేసు నమోదు చేసి తీరుతామని అయన అన్నారు.  ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామారావు సి ఐ రాంబాబు  ఎస్ ఐ టి రామకృష్ణ తదితర పోలీసు యంత్రాంగం  పాల్గొన్నారు.  జిల్లావ్యాప్తంగా ప్రజలతో నేరుగా కలిసి ఉద్దేశంతోనే ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొంటున్నట్టు చెప్పారు. 

No comments:

Post a Comment