Breaking News

12/03/2019

కోడెలకు చంద్రబాబు షాక్...

గుంటూరు, మార్చి 12, (way2newstv.in)
ఎన్నిక‌ల వేళ నాయ‌కులు త‌మ మ‌న‌సులో మాట‌ల‌ను దాచుకోలేక పోతున్నారు. ఇటు పార్టీలు, అటు నేత‌ల మ‌ధ్య చాలా మేర‌కు టికెట్ ర‌గ‌డ‌లు చోటు చేసుకుంటున్నాయి. మీకు ఈ టికెట్ బాగుంటుంద‌ని, గెలుస్తార‌ని పార్టీలు చెబుతుంటే.. కాదు, మాకు ఆ టికెట్లు మాత్ర‌మే కేటాయించండి అనే నాయ‌కులు కూడా తెర‌మీదికి వ‌స్తున్నారు. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ టీడీపీలో టికెట్ల ర‌గ‌డ తార‌స్థాయికి చేరింది. పైకి మాత్రం గుంభ‌నంగా ఉన్నా.. చంద్ర‌బాబుపై నాయ‌కులు మాత్రం గుస్సాగానే ఉన్నారు. దీనికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తున్నాయి. అయితే, రాజ‌ధాని ప్రాంతం గుంటూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మ‌న‌కు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.ఎన్నిక‌ల్లో కోడెల త‌న‌కు త‌న వార‌సుడు డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌కు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే, దీనికి చంద్ర‌బాబు కూడా ఓకే అన్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే శివ‌రామ‌కృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక, కోడెల విష‌యా న్ని ప‌రిశీలిస్తే.. గతంలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెల 2004, 2009 ఎన్నికల్లో పరాభవం ఎదురవడంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారారు. 


కోడెలకు చంద్రబాబు షాక్...

2014లో స్తతెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ వేరే అభ్యర్థి వైపు చూస్తుంది.ఆ సీటును టీడీపీ నిలుపుకోవాలంటే.. కోడెలను సరైన అభ్యర్థిగా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి సీటును త్యాగం చేయాల్సిందిగా కోడెలను పార్టీ కోరింది. అందుకు అంగీకరించిన కోడెల.. దీనికి బదులుగా తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టారు. కోడెల ప్రతిపాదనకు ఓకె చెప్పిన చంద్రబాబు.. నరసరావుపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పారు. దీంతో నరసరావుపేట నుంచి ఎంపీగా కోడెల, ఎమ్మెల్యేగా ఆయ‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణ‌ పోటీ దాదాపు ఖాయమైపోయిందని అనుకున్నారు.ఇంత‌లోనే ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఢిల్లీ రాజకీయాలు తనకు సరిపడవని, అంచేత‌.. తాను ఎంపీగా పోటీ చేయ‌బోన‌ని కోడెల చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో కోడెల‌ నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దం గా లేనన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. ఎంపీగా పోటీకి నిన్న మొన్నటిదాకా సుముఖంగానే ఉన్నట్టు కనిపించిన కోడెల.. ఉన్నట్టుండి మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. మరి కోడెలకు టీడీపీ నచ్చజెప్పుతుందా..? లేక మరోసారి సత్తెనపల్లి టిక్కెట్‌నే కేటాయిస్తుందా? చూడాలి. ఏదేమైనా ఇప్పుడున్న ప‌రిస్థితిలో కోడెల టీడీపీ అధినేత‌కు గ‌ట్టి షాక్ ఇచ్చార‌ని అంటున్నారు.

No comments:

Post a Comment