Breaking News

25/03/2019

గెలుపు ఖాయం... మెజార్టీ కోసమే పోటీ

నాలుగు లక్షల మెజార్టీతో నగేష్ ను గెలిపించుకుంటాం
టీఆర్ఎస్,అభివృద్ది సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నామినేషన్ దాఖలు చేసిన నగేష్
ఆదిలాబాద్, మార్చి 25 (way2newstv.in
రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్  గెలుపు ఖాయమని, మెజార్టీ కోసమే పోటీ జరుగుతుందని రాష్ట్ర  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా జి.నగేష్ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... నాలుగు లక్షల మెజారిటీతో  టిఅర్ఎస్  ఎంపీ అభ్యర్థి నగేష్ ను గెలిపించుకుంటామన్నారు. 


గెలుపు ఖాయం... మెజార్టీ కోసమే పోటీ

టిఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. నగేష్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకుంటున్నాయన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్  నియోజకవర్గంలో జాతీయ రహదారుల కోసం ప్రత్యేకంగా నిధులు తెచ్చామని, ఆదిలాబాద్ లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. రెండవసారి ఎంపీ టికెట్ ఇచ్చిన సీయం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, కోనేరు కోణప్ప, రేఖా శ్యాంనాయక్, ఆత్రం సక్కు, టీడిడిసీ చైర్మన్ లోక భూమారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి, అశోక్, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment