Breaking News

25/03/2019

జోరందుకున్న పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీదేవి ప్రచారం

తుగ్గలి, మార్చి 25 (way2newstv.in
సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడడంతో ప్రచారాలు జోరందుకున్నాయి.పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సోమవారం తుగ్గలి మండల పరిధిలోని రాతన మరియు మామిళ్లకుంట గ్రామాలలో  ప్రచారం కొనసాగించారు.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల కొరకు వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి కి మద్దతుగా తనయుడు రామ్మోహన్ రెడ్డి మరియు కుమార్తె స్నేహ రెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు.


జోరందుకున్న పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీదేవి ప్రచారం

ఫ్యాను గుర్తుకు ఓటేసి తన తల్లిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా నామినేషన్ కు చివరి రోజు కావడంతో మరొక సెట్ నామినేషన్ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కేడిసిసి మాజీ వైస్ చైర్మన్ రామచంద్రా రెడ్డి,తుగ్గలి ప్రహల్లాద రెడ్డి, పగిడిరాయి జగన్నాథరెడ్డి,జిట్టా నాగేష్,రాతన మోహన్ రెడ్డి,తుగ్గలి మోహన్ రెడ్డి,రాతన ఉమన్న మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment