Breaking News

09/03/2019

నాలుగు ముక్కలుగా ఆర్టీసీ

ప్రైవేటీకరణే అంటున్న కార్మిక సంఘాలు
వరంగల్, మార్చి 9, (way2newstv.in)
ఆర్టీసీని ఒక క్రమ పద్ధతిలో చాపకింద నీరులా ప్రయివేటు పరం చేసే ప్రయత్నం జరుగుతున్నది.ముక్కలు చేస్తే ఆర్టీసీ లాభాల్లోకి రాదని, మరింత నష్టాల్లోకి కూరుకుపోతుందని గతానుభవాలు చెబుతున్నా పాలకులు మాత్రం ప్రయవేటీకరణకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీలో కొత్తబస్సులను కొనుగోలు చేయట్లేదు. చాలా వరకు ప్రయివేటు ఆపరేటర్ల బస్సులను తిప్పుతూ కిలోమీటర్‌ చొప్పున బిల్లులు వాళ్లకు చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 10,500 బస్సులుంటే అందులో 2800 బస్సులు అద్దె బస్సులే. ఉన్న ప్రభుత్వ బస్సుల్లోనూ సగానికిపైగా కాలం చెల్లినవే. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోయిన సమయంలో టీఎస్‌ఆర్టీసీలో 59 వేల మంది సిబ్బంది ఉండేవారు. ఈ నాలుగేండ్ల కాలంలో ఏడువేల మంది సిబ్బంది తగ్గారు. వారి స్థానాల్లో ఒక్కరిని కూడా కొత్తగా నియమించలేదు. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నగరంలో ముక్కలుగా చేసి నిర్వహణ బాధ్యత నుంచి ఆర్టీసీని తప్పించాలని ప్రభుత్వం చూస్తున్నది.  ఉన్న బస్సుల్లో సగానికిపైగా కాలం చెల్లిన బస్సులున్నా..కొత్తవి కొనుగోలు చేయకపోవడం, అద్దె బస్సులకు ద్వారాలు తెరవడం, నియామకాలు చేపట్టకపోవడం, సిబ్బందిపై విపరీత పనిభారం మోపడం, టూరిస్టు పర్మిట్ల నిబంధనలకు తూట్లు పొడవటం, విలువైన స్థలాలను తక్కువ ధరకు లీజులివ్వడం, ఆర్టీసీకి నిధులివ్వకపోవడం తదితర అంశాలన్నీ ప్రయివేటు పరం చేయడానికేనని అర్థమవుతున్నది. గ్యారేజీల్లో కాంట్రాక్టర్లే 27 రకాల పనులను తీసుకుని ప్రయివేటు సిబ్బందితో పనిచేయిస్తున్నారు.


నాలుగు ముక్కలుగా ఆర్టీసీ

 నష్టాల పేరుతో చాలా రూట్లలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను యాజమాన్యం క్రమంగా తగ్గిస్తున్నది. మరోవైపు అదే రూట్లలో ప్రయివేటు వాహదారులకు యథేచ్ఛగా అవకాశమిస్తున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రమేర్పడ్డాక ప్రయివేటు ఆపరేటర్ల భరతం పడతామని చెప్పిన సీఎం కేసీఆర్‌...వాటిపైన దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. పైగా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు 5 వేలకు పైగా ప్రయివేటు సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ నుంచి మాత్రమే తిరిగేవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర పట్టణాల నుంచి కూడా వెళ్తున్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నియంత్రించడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రయివేటు ఆపరేటర్లకు మేలు చేసేందుకు కీలకమైన చాలా రూట్లలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. దీంతో అనివార్యంగా ప్రయివేటు వాహనాల వైపు ప్రయాణికులు మరలుతున్నారు. దీంతో యాదృచ్ఛింగా నష్టాలు పెరిగి ఆర్టీసీకి అప్పుల భారం పెరుగుతున్నది. అంతర్గత లాభాల ద్వారా ఆదాయం రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టి కూర్చున్నది. వాస్తవానికి ఆర్టీసీకి వచ్చే ప్రతి వంద రూపాయల ఆదాయంలో 25 శాతం పన్నులకు, వడ్డీలకే పోతున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ అవసరాలకు ఉపయోగించే డీజిల్‌పై వ్యాట్‌ను 22.25 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో టీఎస్‌ఆర్టీసీ డీజిల్‌ కోసం రూ.4437 కోట్లు ఖర్చు పెట్టగా...అందులో రూ.2409 కోట్లు పన్నుల కింద చెల్లిం చింది. పన్నుల వాటా 54.29 శాతం. దీని నుంచి రాష్ట్ర ప్రభు త్వం టీఎస్‌ఆర్టీసీకి మినహాయింపు ఇస్తే ఏటా ఆ సంస్థపై రూ.600 కోట్ల భారం తగ్గుతుంది. సర్కారు ఆ దిశగా ఆలోచించట్లేదు. ఇంకోవైపు బస్సు పాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పెండింగ్‌లో పెట్టింది. వీటికి సంబంధించిన రూ. 1750 కోట్లకుపైగా రాష్ట్ర ప్రభు త్వం ఇవ్వాలి. కానీ, ఆ నిధు లను ఇవ్వకుండా కావా లనే తాత్సార్యం చేస్తున్నది. 
నష్టాలు వస్తున్నాయి కార్మికులను కుదించు కోవా లనే యత్నాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం మొదలు పెట్టింది. లాభన ష్టాలతో సేవలందిస్తున్న ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచకుండా ఉండటం ఆర్టీసీని నిర్వీర్యంలో చేయడంలో భాగమే. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నది ఆర్టీసీనే. కానీ, కొన్నేండ్ల నుంచి గ్రామీణ రూట్లలో కూడా క్రమంగా సర్వీసులను ఆర్టీసీ కుదిస్తున్నది. ఇది కూడా ప్రయివేకరణలో భాగమే. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి దాదాపు రూ.30 వేల కోట్ల విలువచేసే భూములున్నాయి.  ప్రభుత్వం-ఆర్టీసీ గనుక కేరళ తరహాలో అభివృద్ధి చేస్తే ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆర్టీసీ యాజమాన్యం అలా చేయకుండా విలువైన స్థలాలను ప్రయివేటు సంస్థలకు అతితక్కువకు లీజుకు ఇస్తున్నది. ఇవన్నీ విడివిడిగా చూడకుండా కలిపి చూస్తే క్రమంగా చాపకింద నీరులా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రయివేటు పరం చేసే ప్రయత్నమేనని తేటతెల్లమవుతున్నది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ మహానగరంలో ఆర్టీసీ మూడు ముక్కలుగా చేసే ప్రయత్నాలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ప్రయివేటు బస్‌ ఆపరేటర్లకు చెక్‌పెట్టి 1977లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9లో సవరణ చేసి ఆర్టీసీకి రక్షణ కల్పించారు. దానికి కేంద్రం తూట్లు పొడిచే ప్రయత్నాలను మొదలుపెట్టింది. రోడ్డు ట్రాన్స్‌పోర్టు సేప్టీ బిల్లు పేరుతో 2015 నుంచి ప్రయత్నిస్తున్నది. ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఆర్టీసీ, రోడ్డు రవాణా రంగంపై ఆధారపడేవారంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడటంతో ప్రతిపక్షాలు కూడా రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాయి. కానీ, ఆ బిల్లులోని అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే టాక్సీపాలసీ పేరుతో విస్తృతంగా ప్రయివేటు వాహనాలకు, ఓలా, ఊబర్‌ వంటి యాప్‌ ఆధారిత సంస్థలకు ద్వారాలు తెరిశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులోని పనిష్మెంట్ల పద్ధతిని అమలు చేస్తోంది. టూరిస్టు పర్మిట్ల నిబంధనల్నే మార్చేస్తున్నది. ప్రస్తుతం ఏటా రూ.10 వేల నుంచి రూ.3 లక్షలు కడితే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు మధ్యలో ఏ స్టేజీ వద్దనైనా ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశాన్ని ప్రయివేటు బస్సుల వాళ్లకు కల్పిస్తున్నది. అంటే ఇక్కడ కావాలనే ఆర్టీసీ నుంచి ప్రయాణికులను దూరం చేయడమేనని కార్మిక సంఘాలు అంటున్నాయి.లాభాలు పెంచడం కోసం కర్నాటక, తమిళనాడు తరహాలో ఆర్టీసీని విభజిస్తామని, కార్మికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మేలో ప్రకటన చేశారు. ముక్కలుగా చేస్తే లాభాలు వస్తాయనేది పూర్తి అబద్ధమని కర్నాటక, తమిళనాడు అనుభవాలు చెబుతున్నాయి. 1971లో తమిళనాడులో ఆర్టీసీని 22 కార్పొరేషన్లుగా విడగొట్టారు. 1985లో 8 భాగాలుగా కుదించారు. 2017లో ఏడుకు తగ్గించారు. ప్రస్తుతం ఒకే సంస్థగా మార్చాలని చూస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో ఆర్టీసీ విభజనకు ముందు లాభాల్లో ఉండేది. 2000 సంవత్సరంలో నాలుగు ముక్కలుగా చేశాక ఆర్టీసీ ఘోరంగా దెబ్బతిని నష్టాల్లోకి కూరుకుపోయింది. ఆర్టీసీకి కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకుండా, సబ్సిడీలు, రాయితీలు ఇవ్వకుండా ముక్కలుగా చేస్తే లాభాలు వస్తాయనేది అవాస్తమని పై రెండు ఉదాహరణలే చెబుతున్నాయి

No comments:

Post a Comment