Breaking News

09/03/2019

రజకులకు దోభీ ఘాట్ కష్టాలు

రంగారెడ్డి, మార్చి 9, (way2newstv.in)
రజకులతో సంబంధం లేకుండా బట్టలు ఉతికే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో రజకులు తమ ఉపాధిని కొల్పొయే పరిస్థితి నెలొకొంది. రజకులకు ఉపాధిని కల్పించడంలో ఓ పక్క ప్రభుత్వ నిర్లక్ష వైఖరి..మరో వైపు పెరిగిన టెక్నాలజీ వల్ల వారు పోటీతత్వాన్ని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుల వృత్తులనున ప్రోత్సహిస్తామంటున్న ప్రభుత్వాలు నోటిమాటలే కాకుండా ఆచరణలో చూపిస్తే మా బతుకులు మారుతాయని రజకులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వారం శ్రమజీవి శీర్షికలో రజకుల పరిస్థితి నవతెలంగాణ ప్రత్యేక కథనం..
ఒక వ్యక్తికి అందాన్ని తీసుకువచ్చే దుస్తులను రజకులు ఎంతో జాగ్రత్తగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇస్తారు. ఊర్లలో చూసుకుంటే పొద్దున వచ్చి దుస్తులను తీసుకెళ్లి చెరువులు కుంటల్లో ఉతికి సాయంత్రం తీసుకుని వచ్చేవారు. నగరంలో చెరువులు కుంటలు ఎండిపోవడంతో వారికి ఉపాధి కరువవుతోంది. ఒకప్పుడు హుస్సేన్‌సాగర్‌ బట్టలు ఉతికి జీవనం సాగించిన వీరు 2002 సంవత్సరంలో హుస్సేన్‌ సాగర్‌ ఆధునీకరణలో భాగంగా రజకులను మడ్‌పాట్‌లోని దోబీ ఘాట్‌కు తరలించారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దోబిఘాట్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చివరకు వారిని మోసం చేశారు. 



రజకులకు దోభీ ఘాట్ కష్టాలు

అరకొర సౌకర్యాలు ఉన్న మడ్‌పాట్‌లో బట్టలు ఉతికేందు కు వీరు నానా అవస్థలు పడుతున్నారు. ఆ ప్రాం తం కూడా జనావాసానికి దూరంగా ఉండటంతో వారికి ఉపాధి కరువవుతోంది. దుస్తులు వేసేవారు లేక తమ ఉపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయా న్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఉన్నదానినే అడ్జస్ట్‌ చేసుకోవాలని లేకపోతే మీ ఇష్టం అన్నట్టు చెబుతోంది.40 ఏండ్ల క్రితం చెరువుల్లో కుంటల్లో బట్టలు ఉతికితే జతకు 25 పైసలు వచ్చేవి. 20 ఏండ్లకు ముందు ఒక జత దుస్తులను ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తే రెండు రూపాయలు ఇచ్చేవారు. ఇలా వచ్చిన డబ్బులతో తమ పిల్లలను ప్రభుత్వ బడులల్లో అయినా చదివించుకోవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పిల్లలను కూడా రజక వత్తిలోకి తీసుకువచ్చారు. అటు తమ పిల్లలకు చదువులేక ఇటు వృత్తిలో ఎదుగుదల లేక ఆటోడ్రెవర్‌గా లేక కూలీ పనికి పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పూర్వం రజకులకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఒక వివాహాం జరిపించాలంటే వీరు లేనిదే పని అయ్యేదికాదు. పెండ్లి అయిన నుంచి వారికి పిల్లలు పుట్టి తలంటు స్నానాలు చేయించేవరకు వీరి సేవలను ఉపయోగించుకునేవారు. కానీ నేడు వీరు లేకున్న పెండ్లిలు శ్రీమంతాలు శుభకార్యాలు, కాన్పులు ఇతరుల సాయంతో చేయించుకుంటున్నారు. ఇతర కులస్తులు కూడా రజక వృత్తులు చేయడం కూడా వీరికి ఆదరణ కరువైందని చెప్పుకోవచ్చు. 21వ శతాబ్దంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడం తో వాషింగ్‌ మెషిన్‌, డ్రైక్లీనింగ్‌ సెంటర్‌లు అం దుబాటులోకి వచ్చాయి. నగరంలో ప్రతి పది మంది ఇండ్లల్లో 6మందికి వాషింగ్‌మెషిన్‌లు ఉంటున్నాయి. దీంతో రజకులకు దుస్తులు వేసేవారే లేరు. ఐరన్‌బాక్స్‌ లు కూడా అందరికీ అందుబాటులో ఉండటంతో ఎవరి దుస్తులు వారే ఇస్త్రీ చేసుకుంటున్నారు. డ్రెక్లీనింగ్‌ సెంటర్‌లు కమర్షియల్‌ సెంటర్‌లుగా మారడంతో అన్ని ఇతర మతస్తులు సైతం ఇందులో ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందుతున్నారు. దీంతో రజకులు కుల వతి వత్తిని వదులుకోలేక జతకు ఎంత సరే అనుకుని కాలం వెల్లదీస్తున్నారు. గతంలో చౌడుతో బట్టలు ఉతికే వీరు నేడు మార్కెట్‌లో ఎక్కువ ధరకు సబ్బులు, సర్ఫ్‌లు రావడం, మంచి సువాసన వెదజల్లడంతో వీటికే జనాలు మక్కువ చూపిస్తున్నారు. ఒకప్పుడు చౌడుతో బట్టలు ఉతికితే సాధారణ బట్టలు ఎంతో అద్భుతంగా ఉండేవి. కానీ ఇప్పుడు దానికి ఆదరణ తగ్గడంతో సబ్బులుకు ఎక్కువ ధర చెల్లించలేక రజకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక బీసీ రుణాలు ఇస్తామని నాయకులు చెప్పడంతో వాషింగ్‌మిషన్లు కొనుక్కు ని జీవనం సాగించవచ్చని వారు ఆశ పడ్డారు. కానీ ఆ ఆశ కూడా అడియాసగా మారిం ది. అధికారులు స్పందించి వారి పిల్లలకు జీవనోపాధిని కల్పించాలని, అన్ని వసతులతో నగరంలో దోబీఘాట్‌ను ఏర్పాటు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులు రజకులను ఆదుకునేందుకు రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు

No comments:

Post a Comment