Breaking News

09/03/2019

ఉరవకొండ సెంటిమెంట్ పనిచేస్తుందా...

అనంతపురం, మార్చి 9, (way2newstv.in)
అనంతపురం జిల్లాలో ఈసారి అంతా ఉరవకొండపైనే దృష్టి ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడం ఒక సెంటిమెంట్ గా మారింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ విజయం సాధించారంటే టీడీపీ అధికారంలోకి రానట్లేనన్న లెక్కలు ఇక్కడ బలంగా విన్పిస్తున్నాయి. పయ్యావుల కేశవ్ గెలిచి.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అయ్చే ఛాన్సుంది. కానీ పయ్యావులకు ఆ లక్కు ఇప్పటీకీ చిక్కడం లేదు. పయ్యావులకు ఉరవ కొండ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.దాదాపు రెండు దశాబ్దాలుగా పయ్యావుల ఉరకొండ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్ 2004లో వైఎస్ బలమైన గాలులు వీచిన సందర్భంలోనూ గెలిచారు. అయినా పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగే 2009లోనూ పయ్యావుల ఉరవకొండ నుంచి విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై కేవలం 229 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు. 


ఉరవకొండ సెంటిమెంట్ పనిచేస్తుందా...


అదే 2014 ఎన్నికలకు వచ్చే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో 2,275 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పయ్యావులకే ఉరవకొంద టిక్కెట్ ఖాయం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన గెలిస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. బీసీలే ఇక్కడ గెలుపోటములు నిర్ణయిస్తూ వస్తుండటంతో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈసారి కూడా పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశం కన్పిస్తుంది. పయ్యావుల పై నియోజకవర్గంలో ఒక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఓటమి పాలయినా ఎమ్మెల్సీగా ఉండి పయ్యావుల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. మనోడికి ఫేట్ తక్కువ కావడంతో ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి తెలుగుదేశం పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాలుగు సార్లు గెలిచిన పయ్యావుల ఈసారి గెలిచే అవకాశాలున్నాయా? అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి బలంగా ఉన్నారు. పార్టీ కూడా ఉరవకొండ నియోజకవర్గంలో బలంగా ఉంది. మొత్తం పయ్యావుల ఫేట్ మీదనే టీడీపీలో పెద్దయెత్తున డిస్కషన్ జరుగుతుంది. ఈసారైనా పయ్యావుల గెలుస్తారా? గెలిస్తే మంత్రి అవుతారా? అన్నది ఆసక్తికరమే.

No comments:

Post a Comment