ఏలూరు, ఫిబ్రవరి 6, (way2newstv.in)
నీలి విప్లవ రాజధానిగా ఖ్యాతి గడించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో మత్స్య, సముద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. 51శాతం వాటాతో భీమవరంనకు చెందిన ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్, 49శాతం ప్రభుత్వ వాటాగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో భీమవరం మండలంలో సుమారు 150 ఎకరాల్లో విశ్వవిద్యాయం ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం భూమిని కూడా ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సిద్ధంచేసింది.
భీమవరంలో ఫిష్, సీ వర్శిటీలు
గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీటెక్‌లో పోర్టు హార్బర్ ఇంజనీరింగ్, ఫుడ్‌ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎన్విరాన్‌మెంటల్ తదితర కోర్సులు విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేస్తారు. ఇక పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఆక్వాకల్చర్, ఫిష్ బ్రీడింగ్, ఫిష్ పెథాలజీ, ఆక్వా హెల్త్ మేనేజ్‌మెంట్, జెనిటిక్స్, బయోటెక్నాలజీ, ఓషన్ సైన్స్, మెరైన్ కెమిస్ట్రీ, మెరైన్ జియో ఇన్‌ఫ్రాటెక్స్ తదితర కోర్సులు ఉంటాయి. ఇక మత్స్యశాఖ అధికారులకు, రైతులకు శిక్షణా కార్యక్రమాలు చేపడతారు. దేశంలో కేరళ, తమిళనాడులోని కొన్ని విశ్వవిద్యాలయాలు కొన్ని కోర్సులు మాత్రమే అందిస్తున్నాయి. దేశంలో మత్స్య, సముద్రానికి సంబంధించి అత్యధిక కోర్సులతో ఏర్పాటవుతున్న తొలి విశ్వవిద్యాలయంగా దీన్ని పేర్కొనవచ్చు. రానున్న విద్యాసంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించడానికి వీలుగా అనుమతులు ఇస్తూ లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేశారు.
No comments:
Post a Comment