క్రికెటర్ అబిద్ అలీని సన్మానించిన మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట, ఫిబ్రవరి 06:(way2newstv.in)
సిద్ధిపేట స్టేడియంలో త్వరలోనే రంజీ ట్రోఫీలు, డే నైట్ క్రికెట్ మ్యాచ్లు జరిగేలా చూస్తానని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో బుధవారం ఉదయం గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారుల కోసం తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన 1975 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్ కప్ లో ఆడిన క్రీడాకారుడు అబీద్ అలీని శాలువా, మెమెంటోతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.
త్వరలోనే రంజీ ట్రోఫీ, డే నైట్ క్రికెట్ మ్యాచ్లు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1975 సంవత్సరంలో జరిగిన ప్రపంచ క్రికెట్ కప్ లో తొలి తెలంగాణ హైదరాబాదుకు చెందిన క్రీడాకారుడని చెప్పుకోవటం గొప్ప విషయమన్నారు. మన సిద్ధిపేటకు రావడం తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఛీఫ్ కోచ్గా ఉండటం అభినందనీయమని చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, వైస్ ఛైర్మన్ అక్తర్ పటేల్, క్రీడాకారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment