కరీంనగర్, ఫిబ్రవరి 6, (way2newstv.in)
ఈ ఏడాది రికా ర్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగింది. అంచనాకు మించి పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొను గోలు చేసింది.ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం ఎక్కువ నమోదు కావడం, వరదలతో మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువులన్నీ నీటితో నిండిపోవడం వల్ల ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వరిపంట సాగు విస్తీర్ణం గణ నీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లా లో 2.30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని పౌర సరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందుకు అనుగు ణంగా పౌర సరఫరాల సంస్థ జిల్లాలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు 272 కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రాగా, వీటిలో 258 కేంద్రాలకు ఆమో దం తెలిపింది.
రెండోసారి జయశంకర్ జిల్లాదే రికార్డ్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీలు, జీసీసీ ఈ కేంద్రాలు నిర్వహించింది. వీటిలో పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసింది. అనూహ్య రీతిలో ధాన్యం కొనుగోలు 2.60 లక్షల టన్నులకు చేరింది. మొత్తం 258 కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు జరిపినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాఘవేందర్ వెల్లడించారు. జిల్లా ఆవిర్భవించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు జరగడం ఇదే ప్రథమం. జిల్లాల పునర్విభజనతో 2016 అక్టోబర్ 11వ తేదీన భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. జిల్లా ఉనికిలోకి వచ్చిన తర్వాత 2016-17 వానాకాలం సీజన్‌లో 1.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. అప్పట్లో ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో ఈ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 2017-18 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కొంత తగ్గింది. 1.69 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగింది. అయితే ఇతర జిల్లాల్లో కూడా వర్షాభావం వల్ల ధాన్యం దిగుబడులు తక్కువగా రావ డంతో కొనుగోలులో వరుసగా రెండోసారి ఈ జిల్లా రాష్ట్రం లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఖరీఫ్ సీజన్‌లో రైతులు దిగు బడి సాధించిన ధాన్యం నిల్వలను పూర్తిగా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాఘవేందర్ తెలిపారు. ధాన్యానికి ఈ ఏడాది ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. గత సంవత్సరం ధాన్యానికి క్వింటాల్‌కు గ్రేడ్-ఏ రకానికి రూ. 1590, సాధారణ రకానికి రూ.1550 మద్దతు ధరగా ప్రభుత్వం రైతులకు చెల్లించింది. ఈ ఏడాది మద్దతు ధర గణనీయంగా పెరిగింది. క్వింటాల్ కు గ్రేడ్-ఏ రకానికి రూ.1770, సాధారణ రకానికి రూ.1750 మ ద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తమ ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రా ల్లోనే విక్రయించారు. మార్కెట్లో వ్యాపారులు చెల్లిస్తున్న ధర కంటే ప్రభుత్వ మద్దతు ధరే ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. సన్న రకం ధాన్యాన్ని సైతం రైతులు పౌర సరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాల్లోనే ఈసారి అమ్మారు. మార్కెట్లో ఆశించిన ధర పలుకకపోవ డంతో సన్నరకం ధాన్యాన్ని గ్రేడ్-ఏ రకం ధాన్యం కింద పౌర సరఫరాల సంస్థ కేంద్రాల్లో విక్రయించారు. మొత్తం 258 కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 2.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నట్లు సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో గ్రేడ్-ఏ రకం 60 వేల టన్నులు, సాధారణ రకం 2 లక్షల టన్నులు ఉన్నట్లు తెలిపారు. 2.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా వేయగా అనూ హ్య రీతిలో 2.60 లక్షల టన్నుల ధా న్యం కొనుగోలు జరగడం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో ఈసారి ఇతర జిల్లా ల్లో కూడా ఆశించిన రీతిలో వర్షాలు కురవడం వల్ల ధాన్యం దిగుబడులు ఖరీఫ్ సీజన్‌లో పెరిగాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా లో 4.80 లక్షలు, జగిత్యాల జిల్లాలో 3.30 లక్షలు, కరీంనగర్ జిల్లా లో 2.80 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత స్థానంలో నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. కొనుగోలు పూర్తయిన దరిమిలా ధాన్యం కొనుగోలులో జిల్లాది రాష్ట్రంలో నాలుగు లేదా ఐదో స్థానం అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. రైతులకు మద్దతు ధర దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఈ ధా న్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు కేటాయిస్తున్నారు. మిల్లింగ్ చార్జీలను చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం పొందిన రైస్‌మిల్లర్లు నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద రైస్ తమ సంస్థకు అందజేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment