గుంటూరు, ఫిబ్రవరి 23 (way2newstv.in)
తెలుగుదేశం పార్టీకి ఓట్లను తొలగించాల్సీన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా తీసేయాల్సీన అవసరం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం అయన చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లు చేర్పించటం, ఓట్లను తొలగించటం వంటి పనులను వైకాపా అలవాటు. ప్రజాదారణ కోల్పోయిన వారు దొడ్డిదారిలో అధికారంలోకి రావాలను చూస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా దొంగ ఓట్లను చేర్పించేందుకు సిద్దమైందని అయన విమర్శించారు.
ఓట్ల తొలగింపు మాకవసరంలేదు
ప్రజాధారణ పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. క్రిమినల్ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ వైకాపా పార్టీ. ప్రజాధారణ లేకపోవడంతో వైకాపా వాళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెదేపాకు ప్రజాధారణ, ఓటు బలం, అభివృద్ధి బలం ఉంది. రూల్ ప్రకారం అనర్హత కలిగిన ఓట్లను తొలగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా పనిచేసే అధికారులపై వైకాపా వాళ్ళు నిందలు వేస్తున్నారు. వైకాపా వాళ్ళు చేసే పనులు దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం తప్పుడు పనులు చేయదు. క్రిమినల్ పార్టీలో ఉన్నవాళ్ళకు క్రిమినల్ ఆలోచనలే వస్తాయి. ఉన్న ఓటు తీసేయండి అన్న వారిపై కేసు నమోదు చేయవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు.
No comments:
Post a Comment