Breaking News

23/02/2019

పకడ్బందిగా పదవ తరగతి పరీక్షలు

కర్నూలు,  ఫిబ్రవరి 23 (way2newstv.in)
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో అయన సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెల 18వ తేది నంఉచి ఎప్రిల్ 2వ తేది వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 12.15 గంటలవరకు అయా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలు నిర్వహించే 112 కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. 


పకడ్బందిగా  పదవ తరగతి పరీక్షలు 

మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.  తాగునీటి ఏర్పాట్లను చూడాలని సర్వశిక్షా అభియాన్ పీవో కి సూచించారు. బడి పిల్లలు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ  బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులుకు సూచించారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షా కేంద్రాలలో నిరంతరాయంగా విద్యతుత్ సరఫరా వుండాలని ట్రాన్స్ కో అధికారులకు ఆదేశించారు. తగిన ఫ్లైయింగ్ స్వాడ్లను ఏర్పాటు చేయాలని, ఏ విద్యార్ధి కుడా నేల మీద కూర్చోని పరీక్ష రాయకుడాదని అన్నారు.  ఈ కార్యక్రమంలో జేసీ 2 మణిమాల, డిఆర్వో వెంకటేశం, డీఇవో తహెరా సుల్తానా తదితర అధికారులు పాల్గోన్నారు.  

No comments:

Post a Comment