బెంగళూర్, ఫిబ్రవరి 23 (way2newstv.in)
కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షో-2019లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రదర్శనను చూసేందుకు వచ్చిన సందర్శకుల వాహనాలకు యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటుచేశారు. వారాంతం కావడంతో శనివారం ఈ ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది.అయితే శనివారం పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. భారీ అగ్నికీలలతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 150 కార్ల వరకు అగ్నికి ఆహుతైనట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. కార్లలోని ఇంధనం తోడు కావడంతో మంటలు మరింత వ్యాపిస్తున్నాయి.
ఏరో ఇండియా షో-2019లో మరో అపశ్రుతి
అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదం ఆకస్మాతుగా జరిగిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పార్కింగ్ స్థలానికి సమీపంలోనే కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. విమాన ప్రదర్శన జరుగుతుండగా గేట్ నంబర్ 5 వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో 100కు పైగ కార్లు కాలి బూడిద అయ్యాయి. భారీఎత్తున మంటలు అంటుకోవడంతో ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారుకాగా, ఈ ఘటన నేపథ్యంలో ఏరో ఇండియా షోను నిర్వాహకులు నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను అక్కడి నుంచి పంపివేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పార్కింగ్ లోని ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇంతకుముందు ఏరో ఇండియా షో రిహార్సల్స్ సందర్భంగా రెండు సూర్యకిరణ్ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పైలెట్ చనిపోగా, ఇద్దరు పైలెట్లు ప్రాణాలు దక్కించుకున్నారు.
No comments:
Post a Comment