Breaking News

20/02/2019

భారత్ ఆపరేషన్ 25 స్టార్ట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20, (way2newstv.com)
పుల్వామా దాడి అనంతరం పరారైన ఘాజీ రషీద్ వేటకు సైన్యం సిద్ధమైంది. రషీద్ ఎంతో దూరం వెళ్లలేదని దాడి అనంతరం 25 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాడని ఇంటలిజెన్స్ నిఘా వర్గాల అధికారుల సమాచారంతో 25 కిలోమీటర్ల పరిధిలో జల్లెడ పట్టేందుకు ఆర్మీ సిద్ధమైంది.దాడి అనంతరం పుల్వామాకు దారి తీసే దారులు, గ్రామాలు తదితరాల దూరాల పరిధి సుమారు 25 కిలోమీటర్లు. అప్రమత్తమైన సైన్యం దాడి జరగ్గానే ఆ పరిధిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. కాగా.. లైన్ ఆఫ్ కంట్రోల్ మాదిరిగా పరిధిని చేధించుకొని లోపలికి వెళ్ళేందుకు తాజాగా ‘ఆపరేషన్-25’ను ప్రారంభించింది. ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం పొంపోరా జిల్లాలోని ఈ పరిధిలోనే ఉగ్రవాదికి స్లీపర్ సెల్స్ ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. 


భారత్ ఆపరేషన్ 25 స్టార్ట్

భద్రత కాస్త సడలించగానే పరారయ్యేందుకు ఉగ్రవాది యోచిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. జైష్-ఏ-మహమ్మద్‌పై పాకిస్థాన్ నిఘావర్గాల దృష్టి ముందునుంచే ఉంది.కాగా ఈ ఘటన అనంతరం పాక్ దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టేందుకు భారత్ ప్రయత్ని  ఈ సంస్థకు చెందిన నాయకుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ ఇటీవలే పాక్‌లోని కరాచీలో చందా అభియాన్ అనే ఓ కార్యక్రమాన్ని కొనసాగించాడు.రవూఫ్ కశ్మీర్‌లో వచ్చేందుకు తఫ్‌సిరియాత్-అల్-జిహాద్ పేరిట చందాలు సేకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆరు రోజుల వరకూ ఈ చందాలు సేకరించి ట్రస్ట్ అల్ రహమత్‌లో జమచేసినట్లుగా గుర్తించాయి. 2016లో పఠాన్‌కోట్ దాడిలో కూడా ఈ ట్రస్ట్ ద్వారానే ఉగ్రనిధులు అందాయి.జైష్‌కు చెందిన ఈ సంస్థకు ఐఎస్‌ఐ(పాకిస్థాన్ ఇంటలిజెన్స్ సర్వీసెస్) నుంచి ప్రతీయేటా పెద్ద ఎత్తున హవాలా మార్గంలో నిధులు అందడాన్ని భారత్ గుర్తించింది. ఎన్‌ఐఎ ఈ సంస్థకు నిధులు ఇచ్చేవారిపై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసింది.భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడేందుకు ఐఎస్‌ఐ జైష్-ఏ-మహమ్మద్‌ను వాడుకుంటున్నట్లు ఇప్పటికే భారత నిఘావర్గాలు గుర్తించాయి. ఈ విషయాన్ని పలుమార్లు భారత్ అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడంతో ఎఫ్‌ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) కూడా పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దీంతో జైష్-ఏ-మహమ్మద్‌ను వాడుకుం టూ ఐఎస్‌ఐ తమ పబ్బం గడుపుకుంటూ భారత్‌పై కుట్రలు పన్నుతుంది. పాక్ పన్నుతున్న ఈ కుట్రలను భారత్ తిప్పికొట్టేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకుంది. ఆదివారం నుంచి ఎఫ్‌ఎటీఎఫ్ సమావేశం ప్యారిస్‌లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో భారత్‌తో బాటు పుల్వామా దాడిలో మనవెన్నంటే ఉన్న 50 దేశాలకు పైగా దేశాలు పాక్ క్రూరత్వాన్ని బట్టబయలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా నిలబెట్టేందుకు ఈసారి భారత్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

No comments:

Post a Comment