Breaking News

20/02/2019

ఇంకా కశ్మీర్ లో 90 మంది ఉగ్రవాదులు

శ్రీనగర్, ఫిబ్రవరి 20, (way2newstv.in)
పుల్వామా దాడి ఘటనతో దేశ ప్రజలు ఆగ్రహావేశాలు, భయాందోళనల్లో ఉంటే.. మరో సమాచారం భారత ప్రజలను మరింత కలవరానికి గురి చేస్తోంది.ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం కశ్మీర్‌లో మొత్తం 90 మంది ఉగ్రవాదులున్నట్లు ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా వీరంతా ఇప్పుడెక్కడున్నారనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే కొన్ని జాతీయ వార్తా పత్రికలు మాత్రం ఈ ౯౦ మంది స్థానికులు ౬౦ మంది కాగా, పాక్‌కు చెందిన వారు మరో ౩౦ మంది వరకు ఉన్నారు. ఎల్‌వోసీ వెంట ఉన్న ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు ౯౦ మందిని పాక్ ఆర్మీ క్యాంపుల్లోకి మార్చినట్లుగా కూడా చెబుతున్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయొచ్చన్న సమాచారంతో ఉగ్రవాదులను కాపాడేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. 



ఇంకా కశ్మీర్ లో 90 మంది ఉగ్రవాదులు

అయితే ఆ ౯౦ మంది ఎల్‌వోసీ వెంట ఉన్న ఉగ్రవాదులా? లేక కశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులా? అన్న విషయంలో మాత్రం గోప్యత పాటించింది. పూల్వామాలో ఆదివారం సాయంత్రం ప్రారంభించిన ‘ఆపరేషన్ 25’ తొందరలోనే ఫలితాలనిచ్చినప్పటికీ.. మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందడం బాధించింది. ఆర్మీ వర్గాలకు ఇంటలిజెన్స్ ద్వారా అందిన సమాచారం మేరకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డట్టు తెలుస్తోంది. ఇందులో 35మంది ఉగ్రవాదంలో సునిశిత శిక్షణ పొందినట్టు సమాచారం.కశ్మీర్లో జైషే మహమ్మద్ తీవ్రవాదుల ఉనికి ప్రబలంగా ఉన్నట్టు తెలుస్తుండటంతో.. వీరందరిని ఏరివేయడం ప్రస్తుతం భారత్ భద్రతా బలగాల ముందున్న సవాల్. అందుకే ఉగ్ర ఏరివేత కోసం భద్రతా బలగాలు కశ్మీర్‌లోని పూల్వామా జిల్లాను జల్లెడ పడుతున్నాయి. పుల్వామా ప్రాంతం ఉగ్రవాదులకు, ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న వారికి ఇది స్వర్గధామం లాంటిది.ఇక్కడ నివసిస్తున్న వారిలో కొందరు ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తూ.. వారు ఏ దారిలో వస్తే సురక్షితంగా ఉంటారో తెలియజేస్తూ అనుక్షణం పోలీసు, ఆర్మీ దళాల సమాచారాన్ని వారికి చేరవేస్తూ క్షేమం వీరున్న ప్రాంతానికి తీసుకురావడం.. దాడుల అనంతరం వారిని క్షేమంగా ఎల్‌వోసీ ప్రాంతానికి చేర్చడం లాంటివి డబ్బు కోసం చేస్తుంటారు. దీంతో భారత ఆర్మీ పుల్వామాను జల్లెడ పట్టే బాధ్యతను భుజాన వేసుకుంది.మరో ఐదు రోజుల్లో పూర్తి పుల్వామాలో ఉన్న ఉగ్రవాదులెందరనేది స్పష్టం కానుంది. మరోవైపు భారత ఆర్మీ కార్యకలాపాలపై నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ కూడా హైఅలర్ట్ అయ్యింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలో నెలకొంది. కాగా భద్రతా దళాలకు సెర్చ్ ఆపరేషన్‌లో అడుగడుగునా కొందరు సహకరించడం లేదు. తాజాగా సోమవారం ఉగ్రవాది ఘనీ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు అతను ఉన్న భవనాన్ని పేల్చివేశాయి. ఇందులో ఘనీతోబాటు మరొక ఉగ్రవాది మరణించాడు. ఒక ఉగ్రవాది మాత్రం స్థానికుల ఆందోళన.. రాళ్లదాడి ద్వారా తప్పించు కున్నా.. ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఎక్కువ సమయం అక్కడే ఉండలేకపోయి ఆర్మీ తుటాలకు బలయ్యాడు.ఇలా ఆర్మీకి సహకరించని వారు రాళ్ల దాడులలో పాల్గొంటూ భారత దళాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. మరోవైపు ఆయా స్లీపర్ సెల్స్‌కు స్థానికంగా ఉన్న వేర్పాటువాదుల గ్రూపులతో ఆదినుంచే సత్సంబంధాలుండడంతో వారి ఆజ్ఞల మేరకే ఆర్మీకి ఆటంకాలు సృష్టిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆర్మీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఏ ప్రాంతంలో దాడి చేయాలో ముందే నిర్ణయించుకొని ఆయా ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్, వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి వాటిని నిషేధిస్తూ ముందుకు సాగుతోంది. ఏది ఏమైనా పూల్వామాను పూర్తిగా జల్లెడ పట్టి తీరుతామని భద్రతా దళాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment