Breaking News

20/02/2019

రాజకీయాలకు దూరంగా లోహ్ పురుష్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20, (way2newstv.in)
లాల్ కృష్ణ అద్వానీ.. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడానికి కారకుడు. ఆయన రాజకీయ జీవితం ఇక దాదాపుగా ముగిసిపోయినట్లే. బీజేపీలో కురువృద్ధుడుగా పేరుగాంచిన అద్వానీ 2019 ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి పోటీ చేయబోనని స్పష్టత నిచ్చారు. తానే కాదు తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని కూడా స్పష్టం చేశారు. బీజేపీని ఒకనాడు శాసించిన లాల్ కృష‌‌్ణ అద్వానీ ఇప్పుడు మోదీ, అమిత్ షా ల దెబ్బకు తన రాజీకీయ జీవితానికి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సి వచ్చింది.అద్వానీ అంటేనే బీజేపీ… బీజేపీ అంటేనే అద్వానీ. వాజ్ పేయి , అద్వానీల జోడీ బీజేపీకి కలసి వచ్చింది. ఆయన చేపట్టిన రధయాత్రబీజేపీని అధికారంలోకి తెచ్చింది. మోదీని గుజరాత్ సీఎంగా దించాలన్న డిమాండ్ ను వ్యతిరేకించిన ఒకే ఒక వ్యక్తి అద్వానీ. గత ఎన్నికల్లోనూ అద్వానీ మోదీ బలవంతం మీదనే గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికలు జరిగాక అద్వానీని పూర్తిగా పక్కనపెట్టేశారు. 


రాజకీయాలకు దూరంగా లోహ్ పురుష్

కనీసం రాష్ట్రపతి పదవి అయినా దక్కుతుందేమోనన్న అద్వానీ ఆశలను మోదీ ద్వయం అడియాశలు చేసింది.బీజేపీకు బీజం వేసి, కమలం వికసించేలా చేసిన కీలక నేత. అందరిచే లోహ్‌ పురుష్‌ (ఉక్కు మనిషి) అని ప్రశంసలు అందుకున్న పెద్దాయన. దేశం నలుమూలలా పర్యటించి తన వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకున్న రాజకీయ దురంధరుడు. క్రమశిక్షణలో ఆయనకు ఆయనే సాటి. అయితే దేశంలో జరుగుతున్న విషయాలు అన్నీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. అమిత్ షా, నరేంద్ర మోడీ, ఇద్దరూ కలిసి చేస్తున్న పనుల పై ఎంత కోపం ఉన్నా, ఆయన ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఆయనది.  బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలికారు. ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ బలవంతం మీద గాంధీనగర్‌ నుంచి చివరిసారిగా ఆయన పోటీ చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గతవారం స్వయంగా ఆడ్వాణీని కలిసి గాంధీనగర్‌ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో, కనీసం ఆడ్వాణీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లలో ఒకరిని గాంధీనగర్‌ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా ఆడ్వాణీ నిరాకరించారు. ‘‘కుదరదు. ధన్యవాదాలు’’ అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. అద్వానీ  మౌనం పార్లమెంట్ లో కూడా కొనసాగింది. గత అయిదేళ్లలో పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరు 92 శాతం. కానీ ఎలాంటి ప్రసంగాలూ చేయడంలేదు. అయిదేళ్లలో ఆయన మాట్లాడిన మాటలు కేవలం 365 మాత్రమే. మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో యూపీఏ-2 అధికారంలో ఉన్నప్పుడు 2012 ఆగస్టు 8న అసోంలోని అక్రమ వలసల సమస్యపై ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆయన ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు కనీసం 50సార్లు అడ్డం తగిలారు. అయినా తాను చెప్పాల్సింది చేప్పేవరకు ప్రసంగాన్ని ఆపలేదు. మొత్తం 4,957 పదాలు మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికే పౌరసత్వ బిల్లును తీసుకొస్తున్నట్టు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్రకటించింది. గతనెల 8న బిల్లు ప్రవేశపెట్టగా ఆడ్వాణీ సభలో ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 15వ లోక్‌సభ కాలంలో (2009-14) ఆయన 44 చర్చల్లో పాల్గొని 35,926 పదాలు మాట్లాడినట్టు రికార్డులు వెల్లడిచేస్తున్నాయి. ప్రస్తుతం అయిదు సందర్భాల్లో మాత్రమే మాట్లాడారు. అందులో రెండు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా చేసినవి. ఆ రెండు సందర్భాల్లోనూ ‘ఈ తీర్మానానికి నేను మద్దతు తెలుపుతున్నాను’ అని మాత్రమే చెప్పారు. 2014 డిసెంబరు 19 తరువాత ఆయన లోక్‌సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొదటి వరుసలో కూర్చొంటున్నా మౌనంగానే ఉంటున్నారు.బీజేపీలోనే కాదు విపక్షాల్లోనూ అద్వానీ అంటే ఇప్పటికీ గౌరవం. బీజేపీని విమర్శించినా అద్వానీని విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ దగ్గర నుంచి చంద్రబాబునాయుడు వరకూ అద్వానీ అంటే ప్రేమ చూపుతారు. కాంగ్రెస్ నేతలు సయితం అద్వానీకి చేతులు ఎత్తి నమస్కారం పెడతారు. అలాంటి అద్వానీ తనకు తానే స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన వారసులు ప్రతిభ, జయంత్ లను ఎవరో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలన్న ప్రతిపాదనను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు.వయసు మీద పడటం, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గత కొద్దికాలంగా అద్వానీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు మాత్రం తప్పకుండా హాజరయ్యే అద్వానీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరును కూడా ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. ఇప్పుడు బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా తనకు సముచిత స్థానం కల్పించరని అర్థం కావడంతో ఆయన రాజకీయాలనుంచి తనకు తానే తప్పుకుంటున్నారు. మొత్తం మీద వాజ్ పేయి తర్వాత చరిష్మా కలిగిన కమలం పార్టీ నేత అద్వానీ ఇక రాజకీయాలకు దూరమైనట్లే చెప్పాలి. దీనిపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు సయితం ఆవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment