Breaking News

11/08/2018

ఒక వ్యక్తి, ఒక కాంట్రాక్టర్ కోసం పాలన : కోదండరామ్

హైదరాబాద్,అగష్టు 11 (way2newstv.in)
1994 నుంచి రాజకీయాల్లో కీలకమార్పులోచ్చాయి. అంతకు మందు సమస్యలపై పోరాడే వారు. సమస్యలు పరిష్కరించేవారు. రాజకీయాల్లో రెండో కోణం ఉంది. ఈ కోణం లో చూడకుంటె సమస్యలు పరిష్కారం కావని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో రెండు రోజుల ఢిల్లీ పర్యటన ,టీజేఏస్ భవిష్యత్ కార్యచరణ పై అయన మీడియాతో మాట్లాడారు. పౌరవేదిక క ద్వారా ఈ మార్పు తీసుకురావలనుకున్నాం. కాని కుదరలేదు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేసామని అయన వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు, మంచి విద్య దొరకక తల్లిదండ్రులు, ,మంచి వైద్యం దొరకక పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు తెలంగాణ లో ఈ పాలన సరైంది కానే కాదు. వ్యక్తి కేంద్రంగా కుటుంబ సభ్యుల సహకారం తో ప్రభుత్వాన్ని నడపుతున్నారు. సీఎం పెట్టిన మొక్కకు పోలీస్ సెక్యూరిటి ఇచ్చినరు...మరీ నీ మొక్క మీద అంత ప్రేమ ఉంటె రైతు తన పంటమీద ప్రేమ ఉండదా అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనకోసం కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు వచ్చినయి, అవి ఏడకి పోతానయో అర్దం కాదు.  ఒక వ్యక్తి, ఒక కాంట్రాక్టర్ కోసం పాలన సాగుతుంది..ఇది తప్పు ,రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఈ రాజకీయాలను సమాధిచేస్తం. కూలుస్తమన్నారు. ఈ మూడు నెలలో ఏం చేసారని అడుగుతున్నారు. మేము డబ్బు వెదజల్లట్లేదు. ఆకర్షనీయంగా రెచ్చగెట్టో విధంగా మాట్లాడట్లేదు. కాని హైదరాబాద్ లో ఆఫీస్ పెట్టుకున్నాం. అనేక కమీటీలు వేసుకున్నాం. ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని అన్నారు.



ఒక వ్యక్తి, ఒక కాంట్రాక్టర్ కోసం పాలన : కోదండరామ్

ఢిల్లీ లో యస్సీ ,యస్టీ హక్కుల ధర్నాలో  పాల్గొన్నాం. కేజ్రీవాల్ ,అజిత్ సింగ్ ను కలిసాం. తెలంగాణ లో జరుగుతున్న పరిస్దితులు వివరించాం. వాళ్ళు మా వంతు సహకరిస్తామని చెప్పారు. అనేక మంది ఢిల్లీ  రిపోర్టర్లను కలిసాం ఢిల్లీ లో ఒక పాఠశాల లో మూడు గంటలు గడిపాం. తెలంగాణ ఆకాంక్ష కోసం అయితే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రస్తుత రాజకీయాలను తట్టకునె శక్తి టీజేఏస్ కు ఉంది...ఓక బలమైన రాజకీయ ఏకీకరణ చేస్తం. ఈ నెలలో ఒక బలమైన ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో మా  కార్యచరణ ఉదృతంగా ఉంటుంది.. ఉపాధి హామీ పైసలు ఇవ్వట్లేదు. మరి లక్ష కోట్లు ఏడికిపోతున్నాయని అయన అడిగారు. ఇల్లు కట్టమంటె ఉయ్యాలలు ఊగే అటువంటి ఇళ్ళు కడుతున్నారు.. ముట్టుకుంటె కూలిపోతున్నాయని అయన విమర్శించారు.

No comments:

Post a Comment