Breaking News

11/08/2018

మిషన్ కాకతీయపై శ్వేత పత్రం విడుదల చేయాలి

న్యూ ఢిల్లీ అగష్టు 11 (way2newstv.in)
తెలంగాణాలో సర్పంచుల ఎన్నికలను వాయిదా వేయడం అప్రజాస్వామికం. ఎన్నికలను ఎదుర్కోలేక టిఆర్ఎస్ ప్రభుత్వం సాకులు చెప్తుంది.. మోడీ ప్రభుత్వం తెలంగాణ స్ధానిక సంస్ధలకు 3746 కోట్లు  14 ఆర్ధిక సంఘం కింద నిధులు ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ  అన్నారు. కాని టిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదు. శుక్రవారం నాడు బండారు దత్తాత్రేయ తో కలసి తెలంగాణ సర్పంచులు కేంద్ర పంచాయితీరాజ్ ,వ్యవసాయ శాఖ సహాయమంత్రి కలిసి ఫిర్యాదు చేసారు. దత్తాత్రేయ మట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేస్తుందనే టిఆర్ఎస్ ,స్థానిక సంస్థలపై ఎందుకు పెత్తనం చేస్తుంది. చెరువుల పునరుద్ధరణ చేస్తే భూగర్భ జలాలు ఎందుకు పెరగలేదు. మిషన్ కాకతీయ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పంగించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. కేంద్రప్రభుత్వానికి దళితులపట్ల చిత్తశుద్ధి లేదని రాహుల్ గాంధీ అనడం హాస్యాస్పదం . సోనియాగాంధీ,రాహుల్ గాంధీ కాంగ్రస్సే దళిత విరోధులని అయన అన్నారు.



మిషన్ కాకతీయపై శ్వేత పత్రం విడుదల చేయాలి

No comments:

Post a Comment