Breaking News

17/08/2018

ఎంత ఖర్చయినా సరే

హైదరాబాద్, ఆగస్టు 17, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  నడుస్తున్న కంటి వెలుగు కార్యక్రమం  దేశ చరిత్రలోనే అతి గొప్ప దని  మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నాడు  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హుడా ట్రేడ్ సెంటర్, చందానగర్ పీజేఆర్ స్టేడియంలో కంటి వెలుగు కేంద్రాలు ప్రారంభించారు.  అక్కడికి వచ్చిన స్థానికులతో అయన స్వయంగా మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 70 లక్షల మందికి ఈ కంటి వెలుగు ద్వారా చికిత్స అందించటానికి ఎంత ఖర్చు అయినా  ప్రభుత్వం భరించటానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం జనవరి 26 వరకు కొనసాగుతుంది.  ప్రతి ఒక్కరు మీ యొక్క వీలును బట్టి మీ కళ్లను పరీక్షలు చేయించి మీ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. కంటి వెలుగు ప్రారంభించిన మొదటి రోజే జిహెచ్ఎంసి పరిధిలో లక్ష మంది వరకు పరీక్షలు చేయించుకున్నారని అయన అన్నారు. తెలంగాణ వైద్య, విధాన పరిషత్ ద్వారా అతి పెద్ద గొప్ప సంకల్పంతో కంటి వెలుగు ప్రారంభం అయ్యిందని మంత్రి అన్నారు. మంత్రి  పర్యటనలో  స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, జిహెచ్ఎంసి ఉప కమిషనర్ చందాన దీప్తి స్థానిక కార్పొరేటర్లు పూజితా జగదీశ్వర్ గౌడ్,  జిహెచ్ఎంసి అధికారులు, కంటి వెలుగు సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



ఎంత ఖర్చయినా సరే

No comments:

Post a Comment