Breaking News

25/08/2018

లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్.. ఆగస్టు 30 లోపు జైలుకు వెళ్లాలని ఆదేశం!

న్యూ డిల్లీ ఆగష్టు 25 (way2newstv.in)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఈ రోజు షాకిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తన పెరోల్ ను పొడిగించాలన్న లాలూ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ నెల 30లోపు రాంచీలోని బిస్రా ముండా జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉండగా ఆరోగ్యం క్షీణించడంతో కోర్టు ఆయనకు న్యాయస్థానం మే 11న పెరోల్ మంజూరుచేసింది. దీంతో లాలూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి లాలూకు న్యాయస్థానం పెరోల్ గడువును పెంచుతూ వచ్చింది. తాజాగా పెరోల్ గడువు మరోసారి పెంచాలని లాలూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే ఈ మాజీ సీఎంకు రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించాలని జైలు అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఓ కేసులో రాంచీ సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చి శిక్ష విధించిన సంగతి తెలిసిందే.



లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్.. 
    ఆగస్టు 30 లోపు జైలుకు వెళ్లాలని ఆదేశం!

No comments:

Post a Comment