న్యూఢిల్లీ, ఆగష్టు 25 (way2newstv.in)
ఎంబీబీఎస్ సీట్ల విషయంలో సుప్రీంకోర్టులో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థుల వాదనే గెలిచింది. హైకోర్టు తీర్పును తప్పుపడుతూ 550 జీవోను సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. దీంతో వచ్చే ఏడాది నుంచి రిజర్వ్ డ్ కేటగిరీ విద్యార్థులకు న్యాయం జరగనుంది. ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తయిపోవడంతో వాటిజోలికి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది. రిజర్వేషన్ కోటా మించకుండా యధావిధిగా ప్రవేశాలు కొనసాగించాలని ఆదేశించింది. జీవోలో ఒక పార్టు తప్పని చెప్పి రద్దుచేసిన హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసింది. 550 జీవో 2001 నుంచి 2017 వరకు మాన్యువల్గా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఆన్లైన్ సిస్టమ్ రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జీవోలో తప్పులేదని అభిప్రాయపడింది. ఆన్ లైన్ వ్యవస్థకు అనుకూలంగా జీవోను తెలుగు రాష్ట్రాలు సవరణలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది జరిగిన అడ్మిషన్లు అలాగే కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
జీవో 550 ను సమర్ధించిన సుప్రీం
హైకోర్టు తీర్పును కొట్టివేసిన వైనం
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అల్లంకి రమేశ్ మాట్లాడుతూ న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా ఇందిరా బెనర్జీ దగ్గర వాదనలు వినిపించాం. హైకోర్టు తీర్పును పక్కన పెట్టారు. కౌన్సెలింగ్ పూర్తయ్యింది కాబట్టి అడ్మిషన్లను రద్దు చేయొద్దని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి 550 జీవోలో ఏముందో దాన్నే అమలు చేయాలి. మెరిట్ రిజర్వేషన్ అభ్యర్థి ఖాళీచేసిన స్థానాన్ని సంబంధిత రిజర్వ్ డ్ క్యాండిడేట్ కే ఇవ్వాలి. గతంలో అనుసరించాల్సిన విధానాన్నే పాటించాలని సూచించిందని అన్నారు. కౌన్సెలింగ్ కు ఈ నెల 30 వరకు సమయమున్నా ఎందుకు తొందరపడి కౌన్సెలింగ్ జరిపారు. రిజర్వ్ డ్ కేటగిరీలకు చెందిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్ణాలకు లబ్ధి చేకూర్చడానికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరించాయని ఆరోపించారు.
విద్యార్థుల తరపున వాదించిన రామచంద్రరావు మాట్లాడుతూ 323 రిజర్వ్ డ్ కేటగిరీ సీట్లలో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు చేరారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. కానీ వచ్చే సంవత్సరం నుంచి అలా జరగదు. 550లో ఉన్నట్లే ఇకపై జరగాలి. హైకోర్టులోనూ వారికి న్యాయం జరగలేదు. సుప్రీంలోనూ ఈ ఏడాదికి న్యాయం జరగలేదు. తెలంగాణలో 228 రిజర్వ్ డ్ సీట్లను ఓసీలు తీసుకున్నారు. 551 రిజర్వ్ డ్ సీట్లు కోల్పోయారని అన్నారు.
No comments:
Post a Comment