Breaking News

05/07/2018

రేపు పాలమూరులో ఐటీ కారిడర్ స్థాపన

పాలమూరు జూలై 5   (way2newstv.in)     
పాలమూరు జిల్లా అంటేనే ఒకప్పడు వలసలు.. కరవు కాటకాలు మాత్రమే గుర్తుకొచ్చేవి.. తెలంగాణ రాష్ట్రం సిద్దించడంతో.. ఇప్పుడా జిల్లా రూపురేఖలే మారుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాను ఇప్పటికే.. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాలుగా విభజించారు. దీనికితోడు మహబూబ్‌నగర్‌లో త్వరలో ఏర్పాటుకానున్న ఐటీ కారిడార్ ఈ నాలుగు జిల్లాల విద్యార్థులకు వరంగా మారనుంది. ఐటీ పార్క్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 400 ఎకరాల్లో నిర్మించబోయే ఐటీ కారిడార్ కోసం భూ సేకరణ విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్ నగర్, దివిటిపల్లి, ఎదిర, సిద్దాయిపల్లి మధ్యలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరులో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో 10 సంస్థలు ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఐటీ కారిడార్‌తోపాటు మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ హైటెక్ సిటీని పోలిన టవర్ నిర్మించనున్నారు. ఐటీ కారిడార్‌కు సమీపంలోనే ఎయిర్ పోర్ట్‌ను కూడా నిర్మించనున్నారు. 



 రేపు పాలమూరులో ఐటీ కారిడర్ స్థాపన

No comments:

Post a Comment