Breaking News

05/07/2018

తెలంగాణ నేతల్లో సర్వేల టెన్షన్

హైద్రాబాద్, జూలై 5   (way2newstv.in)     
గుబుల్.. గుబుల్‌గా ఉంది.. గుండెలదురుతోంది అన్నట్టు గా ఉంది రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఓవైపు అధికార పార్టీల నేతల పరిస్థితి ఇలా ఉంటే టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల ప రిస్థితి మరోలా ఉంది. సర్వే నిర్వహిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం ఆశావాహుల్లో నెలకొంది. అ దికారమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. సిట్టింగ్ ఎ మ్మెల్యేలు ఎంతమంది గెలుస్తారు.. ఎంతమంది ఓడుతారనే విషయమై ఇప్పటికే పలుమార్లు సర్వే చేయిం చినా.. మూడు నెలలకోమారు సర్వే చేయించడంతో నేతల్లో గుబులు పట్టుకుంది. సర్వేల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఆ నివేదికల ఆధారంగా అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. పైకి మాకేమిటి.. సర్వేలు మాకు అనుకూలం గానే వస్తాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోపల్లోపల వణుకుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.తెలంగాణ నేతల్లో సర్వేల టెన్షన్

నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మె ల్యేల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఇటీవల ఓ సర్వే చేయిం చింది. నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవడం, అ ధికారులతో వ్యవహరించే తీరు, ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి అమలు తదితర ప్రశ్నావళితో టీఆర్‌ఎస్ సర్వే నిర్వహించింది. ముందస్తు సాధారణ ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతున్నం దున పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల స్థానాల్లో అభ్యర్థుల ప్రతిపాదికనపై అధిష్ఠానం పూర్తిస్థాయి సర్వేకు వెళుతోంది. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల్లోనూ కొంత భయం పట్టుకుంది. అయితే, సిట్టింగ్ లపై అంతర్గతంగా విముఖత ఉన్న నేతలు మాత్రం ఈ సర్వేలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సర్వే ప్రకారమే అభ్యర్థుల ఖరారు ఉంటుంద న్న వార్తలు వినబడుతుండడమే వారి సంతోషానికి కారణం.. తాజా సర్వేలో ప్రతికూల నివేదికలు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వారిలో తలెత్తుతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్నిచోట్ల టీఆర్‌ఎస్ నుంచి ఇతరులు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానం ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి అయిదు పేర్లను పరిగణనలోకి తీసుకోవడంతో ఇప్పటివరకు తిరుగులేదనుకొంటున్న ఎమ్మెల్యేల్లో ఆను మానాలు రేకెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో సమీకర ణాలు సరి చూసుకొంటున్నారు. కొన్ని సిట్టింగు నియోజక వర్గాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర సీనియర్ నేతలు, స్థాని కంగా మంచి పేరుండీ ఇతర పార్టీల్లో ఉన్న నేతలు, త టస్థంగా ఉన్నవారు తమ వంతు యత్నాలు చేస్తున్నారు.అధికార పార్టీ నేతల పరిస్థితి ఇలా ఉంటే.. విపక్ష కాం గ్రెస్ నేతల తీరు మరోలా ఉంది. ఓవైపు కేసీఆర్ ముం దస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతారంటూ వినవస్తున్న వార్త ల నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎవరనే కోణంలో అధిష్టానం సర్వేలు జరుపుతోందని తెలుస్తోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు అక్కడి సీనియర్ నేతలను కూడా పరిగణనలోకి తీసుకో నుంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగు తోంది.వారి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గతంలో బహిష్క రణకు గురైన వారిని తిరిగి చేర్చుకుంటూ పార్టీ పావులు కదుపుతోంది. ఆరు నెలల ముందు నుంచే అభ్యర్థుల ఎంపికలో స్పష్టత ఉంటే  ప్రజల్లోకి వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. సర్వేలు చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఇటీవల గాంధీభవన్‌లో 119 నియోజకవర్గాల బాధ్యులు, పార్లమెంటు స్థానాల పార్టీ ఇన్‌ఛార్జులు, సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. కాగా కాంగ్రెస్ చేపట్టే సర్వే ఏ ప్రాతిపదికన చేపడతారో స్పష్టత లేనప్పటికీ అధిష్ఠానం ఈపాటికే వివరాలను సేకరి స్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లోని అభ్యర్థులపైనే అధిష్ఠానం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశముంది. దీంతో కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల సర్వేల్లో తమ పేర్లు ప్రధానంగా వినిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment