Breaking News

17/07/2018

హోదా తెచ్చేది కాంగ్రెసే

విజయవాడ, జూలై 17 (way2newstv.in)  
పడవ ప్రమాదం బాధాకరం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పడవ ప్రమాధాలు పరిపాటి అయ్యిందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆరో్పించారు. సోమవారం నాడు అయన మీడి యాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం హడావుడి తప్ప ఏమీ లేదు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వంతెనలు వెంటనే నిర్మించాలని అయన డిమాండ్ చేసారు. బోట్స్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేవా అనేది ఎప్పటికప్పుడు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ , టీడీపీ పొత్తు పెట్టుకుంటునట్లు ప్రచారం జరుగుతుంది.ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్ని సమనమైన పార్టీలే. బీజేపీ అనే నాణానికి టీడీపీ, వైకాపా బొమ్మ, బోరుసులని అయన విమర్శించారు. ఏ నాలుగు సంవత్సరాలు బీజేపీకి టీడీపీ అధికార మిత్ర పక్షం వైకాపాఅనధికార మిత్ర పక్షమని అయన అన్నారు. అరుణ్ జైట్లై ప్రత్యేక హోదా కుదరదు. ప్రత్యేక ప్యాకేజి ఇష్టం అంటే ఆహా..ఓహొ అన్నారు. టీడీపీ చింతామణి డ్రామా మొదలు పెట్టింది. ఎన్నికల సమయంలో ఏ రెండు పార్టీలు బీజేపీ పంచనా చేరుతాయి.  నాలుగు సంవత్సరాలు టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని అన్నారు. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రానికి మోసం, అన్యాయం, జరిగింది. టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీగా అయన అభివర్ణించారు. వైసీపీ ఒక నకిలీ, కబ్జా పార్టీ. ఇది ఒక అవకాశవాది పార్టీ. అసెంబ్లీ ని బహిష్కరించైనా ఏ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తారు. సీమాంధ్ర స్వర్ణాంద్ర కావాలి ఆంటే ప్రత్యేక హోదా రావాల్సిందే. విభజన చట్టం లో ఉన్న హామీలు అమలు చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని అన్నారు. 



 హోదా తెచ్చేది కాంగ్రెసే 

No comments:

Post a Comment