Breaking News

17/07/2018

మరో వంద కోట్ల మొక్కలే లక్ష్యంగా అడుగులు

హైద్రాబాద్, జూలై 17 (way2newstv.in)  
ఐదేళ్ల  కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల్ని నాటడంతో పాటు సంరక్షించడమే ధ్యేయంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మూడు విడతల్లో 81.60 కోట్ల మొక్కల్ని నాటారు. హరితహారం కార్యక్రమం అమలు తీరుపై నెలకు రెండుసార్లు సమీక్ష. ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం వివరాలు తెలుసుకుంటూ అధికారులకు తగిన సలహాలు, సూచనలను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హరిత హారం కార్యక్రమాన్ని 2015 జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాల యంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలను నాటి 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరితహారం ప్రారంభించిన 2015-16 సంవత్సరంలో 40 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష ్యంగా పెట్టుకోగా, వర్షాభావ పరిస్థితుల దష్ణా 15.86 కోట్ల మొక్కలు నాటారు. రెండో విడత హరిత హారం(2016-17)లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 31.67 కోట్ల మొక్కలను నాటారు. 



మరో వంద కోట్ల మొక్కలే లక్ష్యంగా అడుగులు

ఈ విడతలో హైదరాబాద్-విజయవాడ రహదారి(జాతీయ రహదారి నం.65) వెంట 163 కిలోమీటర్ల మేర మానవహారంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిట్యాల సమీపంలో జూలై 8న మొక్కను నాటి రెండో విడత హరితహారాన్ని ప్రారంభించారు. జాతీయ రహదారి వెంట నాడు నాటిన చెట్లు ప్రస్తుతం పెరిగి వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మూడో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ జూలై 12, 2017న కరీంనగర్‌లో ప్రారంభించారు..తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఎ పరిధిలో నాటనున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు లక్ష్యాన్నికి చేరవవుతున్నారు. అటవీ పునరుజ్జీవన చర్యల్లో భాగంగా క్షీణించిన అడవులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగు తున్నాయి.  తెలంగాణ నేలలు, అడవులకు పరిమి తమైన ప్రత్యేక స్థానిక జాతుల మొక్కలను నాటుతూ అటవీ పునరుజ్జీవ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాటిచెబుతోంది. ఇక సామాజిక అడవుల కింద నాటనున్న 120 కోట్ల మొక్కల్లో ఏటా 40 కోట్ల చొప్పున మొక్కలను నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఏటా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 40 లక్షల మొక్కలను, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేసింది.హరితహారం కార్యక్రమం ప్రారంభమైన రెండేం డ్లలో.. జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రహదారుల వెంట నాటిన మొక్క ల్లో 91 శాతం మొక్కలు బతికాయి. వీటితో నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ  భూములు, రక్షించేందుకు వీలుగా ఉన్న ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో సుమారు 60 శాతం, ఖాళీస్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో 53 శాతం మొక్కలు బతికినట్టు అధికారుల అంచనా! తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం ముఖ్య ఉద్దేశం కేవలం పచ్చదనం విస్తీర్ణాన్ని పెంచడమే కాక.. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడంతో పాటు పునరుజ్జీవింప చేయడంకూడా ఉంది.

No comments:

Post a Comment