న్యూఢిల్లీ జూన్ 26 (way2newstv.in):
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై18వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన సోమవారం ఉదయం పార్లమెంట్ కేబినెట్ వ్యవహారాల ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది.
జులై18నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
18 రోజుల పాటు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యంగ హోదా బిల్లు,ట్రిపుల్ తలాక్ బిల్లు సహా ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనంత్ కుమార్ పేర్కొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు గత పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. పార్లమెంట్ లోపల,బయట కూడా తమ ఆందోళనలు కొనసాగించారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన విషయం విధితమే. ఒక్క రోజు కూడా సమావేశాలు సజావుగా సాగలేదు. మరి ఈసారి కూడా వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
No comments:
Post a Comment