Breaking News

26/06/2018

నర్సరీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్, జూన్ 26 (way2newstv.in):
రంగారెడ్డి జిల్లా దూలపల్లిలోని అటవీ అకాడెమీలో గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న మొదటి విడత శిక్షణ తరగతులకు  15 జిల్లాల గ్రామీణాభివృద్ధి, అటవీ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు హజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రులు హరిత హారంపై రూపొందించిన కరదీపికను ఆవిష్కరించారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద హరిత హారానికి తెలంగాణ వేదికైంది. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్తేనే అనుకున్న విధంగా హరిత తెలంగాణ సాధ్యమని అన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు నాటడంతో పాటు మనుగడ సాగించేలా చూడటం అందరి బాధ్యత. ఆ దిశగా పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసామని అన్నారు. 



నర్సరీ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు

No comments:

Post a Comment