Breaking News

07/01/2020

చలితో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

హైద్రాబాద్, జనవరి 7, (way2newstv.in)
స్వైన్ ఫ్లూమళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ చలిపెరుగుతుండటంతో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క డిసెంబర్ లోనే 43 కేసులు నమోదయ్యాయి. 783 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో టెస్ట్ లు నిర్వహించారు. వీరిలో 43 మందికి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ లో పది మంది వరకు చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు అనుమానం ఉన్న వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా చలి వాతావారణం ఉన్నప్పుడే స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. ఐతే ఈ సారి  చలి తక్కువగా ఉండటంతో అక్టోబర్, నవంబర్ లో స్వైన్ ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఐతే పదిహేను రోజులుగా చలి పెరగటంతో మళ్లీ కేసుల ఫ్లో పెరుగుతోంది.సాధారణంగా స్వైన్ ఫ్లూ వైరస్ రెండేళ్లకొకసారి రూపం మార్చుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. 
చలితో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

2009 నుంచి ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఐతే స్వైన్ ఫ్లూ కేసుల విషయంలో సాధారణంగా ఏటా నవంబర్ నుంచి  అక్టోబర్ వరకు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. గతేడాది కేసులు ఎక్కువ నమోదైనప్పటికీ 2018 నుంచే వైరస్ విజృంభించింది. ఈ లెక్కన ఈ ఏడాది నవంబర్ నుంచి 2020 అక్టోబర్ నాటికి స్వైన్ ఫ్లూ కేసులు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే నవంబర్ లో 19 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చలి ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ లో కేసుల సంఖ్య పెరిగిందని జనవరిలోనూ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.ఐతే స్వైన్ ఫ్లూ విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్యులు సూచిస్తున్నారు. చలి పెరగటం.. చలి గాలుల ప్రభావం ఉందంటే కచ్చితంగా స్వై్న్ ఫ్లూ వైరస్ అటాక్ చేస్తుందంటున్నారు. పైగా చలికాలంలో మంచు ఏర్పడటం.. పొగమంచు కారణంగా వైరస్ ఎక్కువ కాలం బతకటంతో పాటు వ్యాప్తి చెందుతుంది. గ్రేటర్ పరిధిలోనే స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రద్దీ ప్రాంతాలు, పొల్యూషన్ కారణంగా ఈ ప్రాంతంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ ఎఫెక్ట్ పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువగా ఉంటుంది. వీరంతా చలికాలంలో  సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.చలి పెరగటంతో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్, నవంబర్ లో స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు ఏమీ లేవు. కానీ గత నెలలో 43 కేసులు నమోదయ్యాయి. చలి పెరగటం, చలి గాలుల ప్రభావం ఉంటుంది. ఎవరికైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు

No comments:

Post a Comment