Breaking News

02/01/2020

భారీచోరీ గా "యాక్షన్"...పోలీసుల కౌంటర్ "రియాక్షన్"

దొంగతనం జరిగినట్లు చిత్రీకరణ
700 గ్రాముల బంగారం,6కిలోల వెండి అపహరించినట్లు దరఖాస్తు
ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు...24 గంటల్లోనే కేస్ ఛేదన
కరీంనగర్ జనవరి 2 (way2newstv.in)  
జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేష్, కాసుల భాస్కర్ లు  అన్నదమ్ములు.  గాంధీ చౌక్ లో శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్ & జ్యూవెల్లర్స్ పేరిట వ్యాపారం చేస్తున్నారు. గత  డిసెంబర్ 31 రోజున చోరీ జరిగినట్లు, భారీగా సొత్తు దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే వీరు ఇద్దరే కలిసి బ్యాంక్ రుణాలను దూరాశతో ఎగ్గొట్టాలనే దొంగతనం నాటకం ఆడినట్లు నిర్దారించారు.నిందితులు మాస్టర్ ప్లాన్ తో నేరం జరిగినట్లు చిత్రీకరణ...నిందితులు వ్యాపార నిమిత్తం వివిధ బ్యాంక్ లలో అధిక మొత్తంలో రుణాలు,అలాగే ఎస్బిఐ బ్యాంక్ నందు ముద్రలోన్ కూడా భారీగా తీసుకోవడం జరిగింది. 
భారీచోరీ గా "యాక్షన్"...పోలీసుల కౌంటర్ "రియాక్షన్"

నిందితులు ఇద్దరు ఇట్టి లోన్ డబ్బులతో బంగారం,వెండి కొనుగోలు చేసి, వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఇట్టి బ్యాంక్ లను మోసం చేసి, వారు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టాలనే నెపంతో  పక్కాగా మాస్టర్ ప్లాన్ చేసుకున్నారు. దాని ప్రకారం గత నెలలో బంగారం, వెండి కొనుగోలు చేసి షాప్ పేరుపై బిల్లులు తీసుకున్నారు. సొత్తును దొంగతనం జరిగినట్లు నమ్మించి తద్వారా బ్యాంక్ లోన్,ముద్ర లోన్ లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని,మోసం చేయాలని నిర్ణయించుకున్నారు..వారి ప్లాన్ లో భాగంగా డిసెంబర్ 31 న వారి ఇంట్లో బీరువాలను పగలగొట్టి,ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి,దొంగతనం జరిగినట్లు చిత్రీకరించి,సొత్తును మొత్తం వేరు వేరు ప్రదేశాల్లోకి మార్చారు. ప్లాన్ లో భాగంగా నిందితుడైన భాస్కర్ ఇంటికి తాళం వేసి, తన భార్యకి బాగులేదని,హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి కుటుంబ సభ్యులతో కార్ లో వరంగల్ కి వెళ్లాడు. అలాగే ఇంకో నిందితుడైన మహేష్  తన ఇంకో సోదరుడు, ఇతర వ్యక్తులతో కలిసి ఎవరికి అనుమానం రాకుండా లాయర్ ని కలవాలని హైద్రాబాద్ కి వెళ్లాడు. అదే రోజు రాత్రి జమ్మికుంట తిరిగి వచ్చిన భాస్కర్ తమ కుటుంబ సభ్యులను తన కొత్త ఇంటి వద్ద దింపి ,అతను ఒక్కడే షాప్ దగ్గరకి వచ్చి వేసిన తాళం తీసి, తను ముందు గానే పగలగొట్టి పెట్టుకున్న తాళాన్ని ఇంటికి తగిలించాడు. తాళం  పగలగొట్టి చోరీ జరిగినట్లు గా చూపిస్తూ, నమ్మించి చుట్టు పక్కల షాప్ వాళ్ళకి తెలిపి భారీగా దొంగతనం జరిగినట్లు చిత్రీకరించాడు. మరో నిందితుడైన మహేష్ కూడా హైద్రాబాద్ నుండి వస్తుండగా అతనికి ఫోన్ ద్వారా తెలిపినట్లు నటించారు...మహేష్ కూడా తిరిగి వచ్చాక ఎం తెలియనట్లు నటిస్తూ ఇద్దరు నిందితులు వారు ముందుగా చేసుకున్న  ప్లాన్ ప్రకారం హైడ్రామా చేశారు.
బెడిసికొట్టిన నిందితుల మాస్టర్ ప్లాన్..
చేదనలో ఫలించిన పోలీసుల పక్కా వ్యూహం ...
ఈ నేరాన్ని ఎలాగైనా ఛేదించాలని,ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ముందుగా నేర స్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరు, అక్కడ వస్తువులు పడివున్న పద్దతి, నేరానికి ఉపయోగించిన పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బృందాలుగా ఏర్పడి అనుమానితులను విచారిస్తూ, సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి దర్యాప్తును వేగవంతం చేసారు. పోలీసులు ఉపయోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సిసి కెమెరాల ద్వారా ఇంటి వ్యక్తుల పైనే అనుమానం వచ్చింది. దాంతో నిందితులిద్దరిని విడి విడిగా విచారించగా వారే దూరాశతో ఇట్టి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించామని,తద్వారా బ్యాంక్ లలో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టాలను నిర్ణయించుకున్నామని అంగీకరించారు.

No comments:

Post a Comment