Breaking News

31/01/2020

టాలీవుడ్ లో అర్జున్ కూతురు

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.in)
తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇండస్ట్రీలో 90 శాతం వాళ్లే ఉన్నారు. అయితే అబ్బాయిలు వచ్చినంత ఈజీగా అమ్మాయిలు మాత్రం రావడం లేదు. తెలుగులో కొందరు అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చారు కానీ సక్సెస్ మాత్రం కాలేదు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి నిహారిక.. మంచు వారి కుటుంబం నుంచి లక్ష్మీ.. రాజశేఖర్ కుటుంబం నుంచి ఆయన కూతుళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు కానీ పెద్దగా విజయం సాధించలేదు.. క్రేజ్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులోకి మరో స్టార్ హీరో కూతురు కూడా వచ్చేస్తుంది. 
టాలీవుడ్ లో అర్జున్ కూతురు

ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది.2013లో విశాల్ హీరోగా వచ్చిన 'పట్టాత్తు యానై' సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది ఐశ్వర్య.. ఆ తర్వాత సొంత భాష కన్నడలో కూడా 'ప్రేమ బరాహ' సినిమాతో వచ్చింది. ఇప్పటి వరకు మూడు నాలుగు సినిమాలు చేసినా కూడా ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. దాంతో తెలుగు ప్రేక్షకులకు తన కూతురును పరిచయం చేయాలని చూస్తున్నాడు అర్జున్. ఈయన దర్శకత్వంలోనే ఐశ్వర్య తొలి సినిమా చేయాలనుకుంటున్నాడు. దీనికోసం నిర్మాతలను కూడా వెతికేసాడు అర్జున్. త్వరలోనే కూతుర్ని గ్రాండ్‌గా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడు అర్జున్. మరి ఈ యాక్షన్ కింగ్ కూతురు ఇక్కడేం మాయ చేస్తుందో చూడాలిక.

No comments:

Post a Comment