Breaking News

31/01/2020

సెలెక్ట్ కమిటీ సంగతేంటీ

విజయవాడ, జనవరి 31, (way2newstv.in)
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు అసెంబ్లీ అధికారులు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఆర్ డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లును ‌సెలెక్ట్ కమిటీ కి పంపాలని శాసనమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలని... అలా జరగలేదు కాబట్టి బిల్స్ ను పంపడం లేదని శాసన మండలి అధికారులు ఛైర్మన్ కు చెప్పినట్లు సమాచారం.ఈనెల 22న శాసనమండలిలో హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్నవిచక్షాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. 
సెలెక్ట్ కమిటీ సంగతేంటీ

బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ వాదించారు. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రెండు పార్టీల ప్రజాప్రతినిధులు కొట్టుకునే వరకు వెళ్లారు. శాసనమండలి సాక్షిగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.మండలిలో తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేసిన షరీఫ్... తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. అదే సమయంలో అధికార, విపక్షాలకు చెందిన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ ఛాంబర్‌కు వెళ్లి మంతనాలు చేశారు. అక్కడ కూడా ఎవరి వాదనను వారు వినిపించారు. సుమారు మూడు గంటల పాటు వారి చర్చలు జరిగాయి. అనంతరం సభకు వచ్చిన చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సెలక్ట్ కమిటీకి సభ్యుల పేర్లను సూచించాలంటూ ఆయా పార్టీలకు లేఖ రాశారు.ఈ పరిణామంతో ఆగ్రహించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మండలి తీర్మానం కాపీలు వెంటనే కేంద్రానికి కూడా పంపారు.

No comments:

Post a Comment