Breaking News

08/01/2020

పర్మిట్ ఉండాల్సిందే.. (కడప)

కడప, జనవరి 08 (way2newstv.in:
వ్యవసాయ మార్కెట్‌ యార్డుల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కొత్త ఏడాది నుంచి ఈ-పర్మిట్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే వ్యాపారులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. జనవరి ఒకటో తేదీ నుంచి వ్యాపారులు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి రవాణా అనుమతి పత్రం పొందేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పండుతున్న కూరగాయలు, పండ్లు మినహా వరి, పత్తి, కంది, మినుము, పెసర, మినప, జొన్నలు, పసుపు, సజ్జలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే వ్యాపారులు సరకు విలువలో ఒక శాతం రుసుం మార్కెట్‌ కమిటీలకు చెల్లించాలి. ఇప్పటి వరకు సరకు రవాణా చేసే మార్గంలోని చెక్‌పోస్టులు, నెలాఖరుకు పర్మిట్‌ పుస్తకంలో వివరాలు రాసి మార్కెట్‌యార్డులో నగదు రూపంలో చెల్లిస్తున్నారు. 
పర్మిట్ ఉండాల్సిందే.. (కడప)

ఇందులో అవకతవకలను అరికట్టటానికి వీలుగా పారదర్శకత పెంచేందుకు నూతన విధానం కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది. జిల్లాలో గతంలో 12 మార్కెట్‌ యార్డులుండేవి. 1. బద్వేలు, 2.కడప 3. రాయచోటి, 4. ప్రొద్దుటూరు, 5. జమ్మలమడుగు 6.లక్కిరెడ్డిపల్లె 7. రాజంపేట 8. పులివెందుల 9.కమలాపురం 10. సిద్ధవటం 11. మైదుకూరు 12. రైల్వేకోడూరు. నూతనంగా 13వ యార్డుగా ఎర్రగుంట్ల ఏర్పడటంతో వాటి సంఖ్య 13కు చేరింది.  లైసెన్స్‌ దారు తన ఆధార్‌ సంఖ్యతో ఆన్‌లైన్‌లో లాగిన్‌ అయిన తర్వాత పేరు, చిరునామా, సంస్థ వివరాలు, కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం, రవాణా ఎంతదూరం, తదితర సమాచారం నమోదు చేసి అందుకు సరిపడా సొమ్మును ఆన్‌లైన్‌లోనే చెల్లించిన వెంటనే ఈ-పర్మిట్‌ నెంబరు వస్తుంది. ఆ తరువాత సరకు రవాణా చేసుకోవచ్ఛు తనిఖీ అధికారులకు ఆ నెంబరు చూపిస్తే సరిపోతుంది. సంబంధిత శాఖాధికారులకు ఆన్‌లైన్‌లో వివరాలు కన్పిస్తాయి. అక్రమ రవాణాతోపాటు రుసుముల ఎగవేతకు అవకాశం ఉండదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఈ-పర్మిట్‌ జారీ జనవరి నుంచి మొదలుకానుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి వీటిపై అధికారులు అవగాహన కల్పించారు. వ్యాపారులకు సైతం ఈ-పర్మిట్‌ల జారీ, పొందే విధానంపై వివరించారు. వ్యాపారులు వ్యవపాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధిత ఈ-పర్మిట్‌లను పొంది రవాణా చేసుకోవచ్ఛు ముఖ్యంగా సిబ్బంది చేతివాటం, అక్రమాలకు తావులేకుండా ఈ విధానంలో పారదర్శకంగా ఉంటుంది. ఇందు కోసం అన్ని చెక్‌పోస్టుల వద్ద ఈ-పాస్‌ యంత్రాలను సిద్ధం చేస్తాం. కార్యాలయంలో ఈ-పర్మిట్‌ పొందలేని వారు చెక్‌పోస్టులలో ఈ-పర్మిట్‌ను పొంది తమ సరకులను రవాణా చేసుకునే అవకాశముంది.

No comments:

Post a Comment