మెదక్, జనవరి 8, (way2newstv.in)
రికార్డులన్నీ కంప్యూటర్లలో ఎక్కించడంతోపాటు అన్ని పనుల్ని ఆన్‌లైన్ ద్వారా వసూలు చేసేందుకు ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘ఈ–పంచాయతీ’ ప్రాజెక్టు పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇప్పటికీ సగానికిపైగా ఊర్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ లేక పంచాయతీ సెక్రటరీలంతా మాన్యువల్‌గానే రికార్డులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 5,908 గ్రామాల్లోనే కంప్యూటర్లు ఉండగా 6,843 పంచాయతీల్లో లేవని ఇటీవల లోక్‌సభకు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమర్పించిన నివేదికతో వెల్లడైంది.కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2012–13 నుంచి 2015-–16 వరకు అమలు చేసిన రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరన్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌ఏ) పథకంలో గ్రామాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు కొనేందుకు నిధులు రిలీజ్ చేసింది.
సగం పంచాయితీలకు కంప్యూటర్లే లేవు
ఆ తర్వాత 2018––19 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎస్‌ఏ)గా మార్చి అమలు చేస్తున్నారు. 14వ ఫైనాన్స్ నిధుల్లో ఈ–పంచాయతీల నిర్వహణకు 10 శాతం డబ్బులు వినియోగించుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, ఒడిశా, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రాల్లో వంద శాతం గ్రామాలు ఆన్‌లైన్ సేవలుఅందిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో 90 శాతం గ్రామాలు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి. తెలంగాణ లో మాత్రం గత ఐదేళ్లుగా ఈ– పంచాయతీల సంఖ్య సగానికి మించలేదు. అంతేగాక ఈ– పంచాయతీల్లో భారత్ బ్రాడ్ బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీఎన్‌ఎల్) కనెక్టివిటీకి సిద్ధంగా ఉన్న గ్రామాల సంఖ్య 2,047 మాత్రమేనని తోమర్ సమర్పించిన నివేదిక వెల్లడిస్తోంది.గ్రామాల్లో ప్రతి నెలా పంచాయతీ మీటింగ్‌లో ఆమోదించిన తీర్మానాలు, వాటి ఫొటోలను సెక్రటరీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీల్లో చేపట్టిన పనులు, ఖర్చు, తనిఖీలు, అభివృద్ధి ప్రణాళిక, హరితహారం నర్సరీలు, మొక్కల పంపిణీ, సంరక్షణ, పంచాయతీ ఆడిట్ వివరాలనూ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. లే అవుట్లు, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ, మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్స్‌లను ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేయాలి. ఇందుకోసం కంప్యూటర్లు లేక పంచాయతీ సెక్రటరీలు తాము చేయించిన పనుల వివరాలను, రికార్డులను నమోదు చేసేందుకు ఎంపీడీఓ ఆఫీసులో క్యూ కడుతున్నారు. కొన్నిచోట్ల కంప్యూటర్లు ఉన్నా నెట్, ఆపరేటర్లు లేక వేల కంప్యూటర్లు మూలనపడి దుమ్ము కొట్టుకుపోతున్నాయి.బర్త్, డెత్, క్యాస్ట్, ఇన్‌కమ్ తదితర సేవలను ఆన్‌లైన్‌లో అందించడానికి కేంద్రం ప్రారంభించిన కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ) ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా మీ సేవ కేంద్రాలు, సీఎస్‌సీలను కలిపే నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సీఎస్‌సీ సెంటర్లు 2,68,398 ఉండగా వాటిలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 57,752 ఉన్నాయి. మహారాష్ట్రలో 36,832, బీహార్‌లో 26,956, ఆంధ్రప్రదేశ్‌లో 6,941 ఉండగా, మన రాష్ట్రంలో ఈ సంఖ్య 3,281 దాటలేదు.
No comments:
Post a Comment