Breaking News

30/01/2020

గాడ్సే, ప్రధాని మోదీల భావజాలం ఒక్కటే: రాహుల్‌ గాంధీ

తిరువనంతపురం జనవరి 30 (way2newstv.in)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించారు. నాథూరామ్‌ గాడ్సే, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే భావజాలాన్ని నమ్ముతారని రాహుల్‌ పేర్కొన్నారు. గాడ్సే భావజాలాన్ని నమ్ముతానని చెప్పడానికి మోదీకి ధైర్యం లేదు.. అంతే తప్ప వేరే తేడా ఏం లేదన్నారు రాహుల్‌. గాడ్సే తనకు తాను నమ్మలేదు.. కాబట్టే గాంధీని చంపేశాడు. 
గాడ్సే, ప్రధాని మోదీల భావజాలం ఒక్కటే: రాహుల్‌ గాంధీ

గాడ్సే ఎవర్ని ప్రేమగా చూసుకోలేదు. ఎవర్ని పట్టించుకోలేదు.. నమ్మలేదు. మోదీ కూడా ఈ విషయంలో గాడ్సేతో సమానం. ఎందుకంటే.. మోదీ తనకు తానే ప్రేమించుకుంటాడు.. తనకు తానే నమ్ముకుంటాడు అని రాహుల్‌ తెలిపారు.భారతీయులందరూ తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన రోజులు వచ్చాయి. తాను భారతీయుడిని అని నిర్ణయించేందుకు మోదీ ఎవరు? అని రాహుల్‌ ప్రశ్నించారు. భారతీయుడా? కాదా? అని నిర్ణయించేందుకు మోదీకి ఎవరు లైసెన్స్‌ ఇచ్చారు? తాను భారతీయుడినని తనకు తెలుసు. భారతీయుడినని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు రాహుల్‌ గాంధీ. ఉద్యోగాలు అడిగినప్పుడల్లా.. మోదీ యువత దృష్టిని మరలుస్తారని రాహుల్‌ పేర్కొన్నారు. ఎన్నార్సీ, సీఏఏలతో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మండిపడ్డారు.

No comments:

Post a Comment