హైదరాబాద్ జనవరి 30 (way2newstv.in)
వివిధ పంట రుణాల పరిమితి పెంపుపై తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరానికి రూ. 4.25 లక్షలు, పసుపు ఎకరానికి రూ. 60 వేల నుంచి రూ. 68 వేలు, వరి ఎకరానికి రూ. 34 వేల నుంచి రూ. 38 వేలు, పత్తి ఎకరానికి రూ. 35 వేల నుంచి రూ. 38 వేలకు పంట రుణాలు పరిమితి పెంచుతున్నట్లు కో ఆపరేటివ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
పంట రుణాల పరిమితి పెంపు.. కో ఆపరేటివ్ బ్యాంక్ కీలక నిర్ణయం
రైతులు పంట పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఆర్గానిక్ పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కో ఆపరేటివ్ బ్యాంకు తాజా నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment