హైద్రాబాద్, జనవరి 10 (way2newstv.in)
జాతీయ జెండాలకు ఫుల్ గిరాకీ పెరిగింది. రాష్ర్టంలో కేవలం మూడు వారాల్లోనే 10 లక్షల ఫ్లాగ్స్ అమ్మకాలు జరిగాయి. సీఏఏ, ఎన్ఆర్సీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలు, ఆందోళనలతో జెండాల అమ్మకాలు భారీగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచే జాతీయ జెండాలను సప్లై చేస్తున్నారు. వ్యాపారులు మూడు వారాలుగా బిజీబిజీగా ఉంటున్నారు. గతంలో ఎన్నడూ ఇంత గిరాకీ చూడలేదని చెబుతున్నారు.ఈనెల 4న హైదరాబాద్ లో జరిగిన ర్యాలీలో లక్షల మంది పౌరులు జాతీయ జెండాలతో సీఏఏ, ఎన్ఆర్ సీపై నిరసన తెలిపారు.
భారీగా అమ్ముడవుతున్న జాతీయజెండాలు
శుక్రవారం ఎంఐఎం ఆధ్వర్యంలో మీర్ ఆలం ఇద్గా నుంచి శాస్త్రిపురం వరకు మెగా ర్యాలీకి ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ ర్యాలీ కోసం లక్ష జెండాలు సప్లై చేశామని మైలార్ దేవులపల్లికి చెందిన వ్యాపారి ఉస్మాన్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లోని ప్రతి ముస్లిం, మైనారిటీ పౌరుల ఇళ్ల మీద జాతీయ జెండా పెట్టాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. దీంతో ముస్లింల ప్రభావం ఉన్న అన్ని ఏరియాల్లో ఇళ్ల మీద జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. వ్యాపారులు ఇందుకోసం కూడా భారీగా ఫ్లాగ్స్ సప్లై చేశారుసాధారణంగా ఏటా ఆగస్టు 15, జనవరి 26కు కొన్నాళ్ల ముందు జాతీయ జెండాలు తయారు చేస్తుంటామని వ్యాపారులు చెప్పారు. అయితే జనవరి 26 కోసం సిద్ధం చేసిన జాతీయ జెండాలను సీఏఏ, ఎన్ఆర్ సీ ర్యాలీల కోసం ఆర్డర్స్ రావడంతో అమ్మేశామని తెలిపారు. మళ్లీ జెండాల తయారీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా జాతీయ జెండాల ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయని, ఈ డిమాండ్ వల్ల మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీల ఆర్డర్స్ ను నిలిపివేశామని తయారీ దారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment