వరంగల్ అర్బన్ జనవరి 02 (way2newstv.in)
రెండో దశ పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండలం లోని బావుపేట గ్రామంలో లో అంగన్వాడి అంగన్వాడి ప్రాథమిక పాఠశాల నర్సరీ ని జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జె పాటిల్ పరిశీలించారు. పాఠశాల పరిసర ప్రాంతం లో గ్రౌండ్ పిచ్చిమొక్కలు తొలగించి చదను చేయలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామ నర్సరీ లో గ్రీన్ ప్లాన్ ప్రకారంగా నిర్దేశించిన ప్రకారంగా స్థానికంగా విత్తనాలను సేకరించి నర్సరీ లో మొక్కలు పెంచాలని అన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులోనికి రోజు వారిగా తరలించాలని, సూరారం గ్రామం లో మొక్కల పెంపకం ను పరిశీలించి చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.
నర్సరీలను పరిశీలించిన కలెక్టర్
జీలుగుల లో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను పరిశీలించారు.ఇంకుడు గుంత నిర్మాణానికి పనులు ప్రారంభం నర్సరీ పరిశీలనజగన్నాథ్ పూర్ లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను గ్రౌండింగ్ చేయాలి 100 శాతం ఇంకుడు గుంతలు స్మశాన వాటిక నిర్మణం పూర్తి చేస్తే 5 లక్షలు నగదు ప్రోత్స కాహాన్ని అందజేస్తామని కలెక్టర్ వెల్లడి.సామూహిక చెట్ల పెంపక క్షేత్రాన్ని కుడా కలెక్టర్ పరిశీలించారు. డంపింగ్ యార్డు నిర్మాణ పనులు పరిశీలన సత్వరమే పూర్తి చేయాలని సర్పంచికి ఆదేశాలిచ్చారు. గ్రామంలో పగటి పూట విద్యుత్ లైట్లు వెలిగిస్తే కార్యదర్శి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. సురారం అవెన్యూ ప్లాంటేషన్ కు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను దొంగ లించిన వారి పై కేసులు నమోదు చేయండని యస్ ఐ కి కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
No comments:
Post a Comment