తిరుమల జనవరి 02 (way2newstv.in)
శ్రీవారి ఆలయంలో వివాదాలుకు కేంద్ర బిందువుగా రమణ దీక్షితులు మారుతున్నారని బిజేపి కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ఆచార వ్యవహారాలుకు విరుద్దంగా రమణ దీక్షితులు ఎలా వ్యవహరిస్తారు. నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు శ్రీవారి ఆలయంలో సేవలు అందిస్తూ వుంటే రమణధీక్షితులు మాత్రం వ్యక్తిగత ప్రాద్యానత ఎందుకు ఇస్తూన్నారని అయన ప్రశ్నించారు.
టీటీడీ వివాదాల్లో రమణ దీక్షితులు
టిటిడి పై అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులును దోడ్డిదారిన టిటిడిలోకి ఎలా తీసుకువచ్చారు. ఆలయంలో జరిగిన ఘటన పై టిటిడి శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అయన అన్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది డైరీలు, క్యాలండర్లు భక్తులుకు సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయని అయన విమర్శించారు.
No comments:
Post a Comment