Breaking News

30/01/2020

బాసరలో వైభవంగా వసంత పంచమీ

నిర్మల్ జనవరి 30, (way2newstv.in)
త్రిశక్తి స్వరూపిణి చదువుల తల్లి సరస్వతి దేవి కొలువుతీరిన బాసర పుణ్యక్షేత్రం లో శ్రీ పంచమి, వసంత పంచమి  అమ్మవారి జన్మదిన వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువుతీరిన బాసర భక్త సముద్రాన్ని తలపిస్తుంది. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న విద్యా దాయిని పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాఘమాసంలోని శ్రీ పంచమి రోజున అమ్మవారి పుట్టిన రోజు వేడుకలను సాంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. ఈ రోజు ,రేపు ఇట్టి గడియలు ఉండటం వేషేశం. 
బాసరలో వైభవంగా వసంత పంచమీ

దీంతో వేద పండితులు బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారికి వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం అలంకరణ ధూప దీప నివేదన సమర్పించి,అర్చన,స్థాపిత దేవత హోమం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి అక్షరాభ్యాస పూజలు ప్రారంభించారుఏ. ఈ  విశేష ఘడియల్లో తమ చిన్నారులకు అమ్మవారి చెంత అక్షరాభ్యాసం నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతం అని తలుస్తారు.   సుదూర ప్రాంతాలనుంచి భక్తులు బాసర దారి పట్టారు. ముందుగా గోదావరి నది తీరానికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. వేదపండితులు చిన్నారులకు వేదోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. మరో వైపు  అమ్మవారి పుట్టినరోజు పవిత్రంగా భావిస్తున్న భక్తులు అమ్మవారికి చీర రవిక బియ్యాన్ని సమర్పిస్తూ తమ మొక్కులను తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్ళు, ఆరోగ్య శిబిరాలు , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment