Breaking News

30/01/2020

ఫిబ్రవరి 10 నుంచి ఆన్ లైన్ లో ఫ్యాన్సీ నెంబర్స్

హైద్రాబాద్, జనవరి 30, (way2newstv.in)
ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులకు ఎంత మోజు ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎంత ఖ‌ర్చు పెట్టైనా ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతుంటారు. సినీ స్టార్లు, పొలిటికల్‌ లీడర్లు కూడా వాటి కోసం ఆర్టీవో ఆఫీసులకు వెళ్తారు. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబరు కేటాయింపుకు భిన్నంగా కొత్త విధానం ఉండనుంది. తెలంగాణ ట్రాన్స్‌పోర్టు వెబ్‌సైట్‌లో స్టేటస్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్లపై క్లిక్‌చేసి వాహనదారుడు నివాస పరిధిలోకి వచ్చే ఆర్టీఓ కార్యాలయంపై క్లిక్‌ చేస్తే... ఆయా కార్యాలయం పరిధిలో ఉండే నంబర్లు కనబడుతాయి.ఆసక్తి గల నంబరును ఎంపిక చేసుకుని నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. 
ఫిబ్రవరి 10 నుంచి ఆన్ లైన్ లో ఫ్యాన్సీ నెంబర్స్

ఒంటిగంట వరకు ఎంపిక చేసుకున్న నంబరుకు ఒకే ఆఫ్లికేషన్‌ వస్తే ఆటోమేటిక్‌గా కోరుకున్న నెంబరును కంప్యూటర్‌ కేటాయిస్తుంది. నిర్ణీత సమయం ఒంటి గంటలోపు ఒకటికి మించిన అఫ్లికేషన్‌ వస్తే ఆన్‌లైన్‌లో బిడ్స్‌ వేయాల్సి వస్తుందిఎవరి బిడ్‌ మొత్తం ఎక్కువగా ఉంటుం దో వారి వాహనానికి నంబరు ఆటోమేటిక్‌గా కేటాయింపబడుతుంది. బిడ్‌ను మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తక్కువ బిడ్‌ చేసిన వాహనానికి నంబరు దక్కదు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తక్కువ బిడ్‌ చేసిన వారి ఎకౌంట్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి జమ అవుతుంది. దళారుల జోక్యం, అవినీతి లేకుండా ఉండటానికి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఫ్యాన్సీ నంబరు పొందే అవకాశం ఉంది.
* ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుల్లో అవకతవకలు కూడా పెరిగిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
* అధికారులు, సిబ్బంది కలిసి అనుకూలమైన వ్యక్తులకు ఫ్యాన్సీ నెంబర్లు కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 * ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్‌ పెట్టి... ఫ్యాన్సీ నంబర్లను పారదర్శకంగా కేటాయించడానికి తెలంగాణ రవాణాశాఖ సిద్ధమైంది.
* ఫిబ్రవరి 10 నుంచి ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది

No comments:

Post a Comment