Breaking News

31/01/2020

11 వేల కోట్ల భారంకు రెఢీ

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.in)
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. టీఆర్ఎస్ సర్కారు ఆదాయం పెంచుకునే పనిలో పడింది. పంచాయతీలు, జడ్పీలు సహా మున్సిపల్ ఎలక్షలన్నీ ముగియడం.. వచ్చే నాలుగేండ్ల వరకు గ్రేటర్ హైదరాబాద్, మరో రెండు మూడు లోకల్బాడీలకు తప్ప మరే ఎన్నికలూ లేకపోవడంతో.. పాలనపై ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. పన్నుల ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని, అవకాశమున్న అన్ని పన్నులు, చార్జీలను సవరించాలని సర్కారు నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రాపర్టీ ట్యాక్స్, భూములు, వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించాయి. త్వరలో కరెంటు చార్జీలను కూడా పెంచే అవకాశముందని పేర్కొంటున్నాయి.మున్సిపల్ రిజల్ట్స్ వచ్చిన రోజున సీఎం కేసీఆర్ ట్యాక్సుల పెంపుపై ఇండికేషన్ ఇచ్చారు.
11 వేల కోట్ల భారంకు రెఢీ

 ‘‘మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చాలా కాలంగా పెంచలేదు. ఇప్పుడు కొంత పెంచక తప్పదు. అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటం’’అని సీఎం చెప్పారు. ఈ మేరకు ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే చాన్స్ ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. తర్వాత గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను పెంచుతారని వెల్లడించారు. మరోవైపు కరెంటు చార్జీల పెంపునకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, 50 శాతం వరకు పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలు చేశాయని అధికారవర్గాలు తెలిపాయి.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ఆదాయాన్ని భారీగా పెంచాలని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం వసూలు చేస్తున్న ట్యాక్స్కు అదనంగా 50 శాతం వరకు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల జీహెచ్ఎంసీకి ఏటా సుమారు రూ. వెయ్యి కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. 2019–20లో రూ.1,850 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా సుమారు రూ.1,118 కోట్లు వసూలయ్యాయి. మరో రూ.732 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాల బకాయిలే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ను చివరిసారిగా 2009లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెంచారు. అప్పట్లో ఒక ప్లాట్/బిల్డింగ్/కమర్షియల్ కాంపెక్స్ ఉన్న ప్రాంతంలో వాటిని కిరాయికి ఇస్తే వచ్చే ఏడాది మొత్తం సొమ్ములో 30 శాతం మేర ప్రాపర్టీ ట్యాక్స్గా నిర్ణయించారు. ‘‘ఈ పదేండ్లలో కిరాయిలు డబుల్ అయ్యాయి. ప్రాపర్టీ వాల్యూ బాగా పెరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచక తప్పదు..’’అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీగా ప్రాపర్టీ ట్యాక్స్పెంచనున్నట్టు తెలిసింది. కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఏ మేర ట్యాక్స్ పెంచవచ్చన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టణాలను బట్టి పెంపు ఉంటుందని, పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 40 శాతం వరకు పెంచాలన్న ఆలోచన ఉందని చెప్తున్నారు. పాత ఐదు కార్పొరేషన్లలో అదనంగా 30 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు వసూలయ్యేలా ట్యాక్స్ సవరణ ఉంటుందని అంటున్నారు. గతేడాది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.60 కోట్లు, ఖమ్మంలో రూ.23 కోట్లు, కరీంనగర్ లో రూ.28 కోట్లు, రామగుండంలో రూ.10 కోట్లు, నిజామాబాద్ రూ.25 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్వసూలైంది.రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇంటి పన్నుల వసూలుపై సర్పంచులు ఇంతకాలం సీరియస్ గా దృష్టి పెట్టలేదు. దాంతో ఒక్కో ఏడాది ఒక్కో తీరుగా ట్యాక్స్ వసూలైంది. 2017–18లో మొత్తంగా 87 శాతం వసూలుకాగా.. 2018–19లో 86 శాతం మాత్రమే వచ్చింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం కచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత సర్పంచులపై ఉంది. ఈ మేరకు ఇంటి పన్నుల వసూలుపై ఫోకస్ పెట్టనున్నారు. అయితే పంచాయతీల్లో ఇంటి పన్నును ఏ మేరకు పెంచాలన్న దానిపై సీఎం కేసీఆర్  స్వయంగా సర్పంచులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని ఓ సీనియర్ ఐఏఎస్ చెప్పారు.

No comments:

Post a Comment