Breaking News

31/01/2020

వివాదాల మయం..బోస్టన్ కమిటీ

విజయవాడ, జనవరి 31, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు బెటర్ అంటూ.. జగన్మోహన్ రెడ్డి మాటలతోనే నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు .. ఇచ్చిన ఫీజు రూ. ఐదు కోట్ల 95 లక్షలుగా తెలుస్తోంది. ఎలాంటి జీవో లేకుండా. బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతలు ఇచ్చిన ప్రభత్వం.. ఆ కంపెనీలో రహస్య లావాదేవీలు జరిపింది. ఈమెయిల్స్ ద్వారా వ్యవహారాలు నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా.. ప్రణాళికా విభాగం ద్వారానే రూ. ఐదు కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు.. బోస్టన్ గ్రూప్‌కి కూడా.. దాదాపుగా ఆరు కోట్లు.. ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. 
వివాదాల మయం..బోస్టన్ కమిటీ

మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు… 2019 నవంబర్‌ 27వ బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా.. ముందుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీనో బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చేసింది. అంటే… ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలిపిన తర్వాత కేవలం.. నెల అంటే.. నెల రోజుల్లోనే… బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఏ పరిస్థితుల్ని అధ్యయనం చేసిందో ఎవరికీ తెలియదు. చివరికి నివేదిక మాత్రం సమర్పించింది. బోస్టన్ నివేదికలో.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. ఆలాగే.. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయిన.. మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే… ముందస్తుగా ఓ రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి.. ఇచ్చేందుకు.. రూ. ఆరు కోట్లను సమర్పించున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రాజధానిపై రిపోర్ట్ ఇస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసే వరకూ.. ఆ గ్రూప్‌కు ఎప్పుడు.. అవకాశం ఇచ్చారు..? జీవో ఏది..? అనే అంశాలపై చాలా మంది సెర్చ్ చేశారు. ఎవరికీ వివరాలు దొరకలేదు. ప్రభుత్వం కూడా.. చెప్పలేదు. చివరికి కోర్టులు అడిగినా చెప్పిన దాఖలాలు లేవు. ఏదో వంకతో వాయిదాలు వేస్తూ వస్తోంది. అయితే.. ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు.. అంచనా వేయలేని విధంగా ఉన్నట్లుగా.. ఒక్కొక్కటి బయటపడుతున్న కొద్దీ తెలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి

No comments:

Post a Comment