Breaking News

06/12/2019

మూడేళ్ల నుంచి మహిళా కమిషన్ కు ఖాళీ

హైద్రాబాద్, డిసెంబర్ 6, (way2newstv.in)
ఆపదలో ఉన్న మహిళలకు భరోసా ఇవ్వడం, వారి హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మహిళలపై జరిగే వేధింపులు, హింస, దాడులపై స్పందించి చర్యలు తీసుకునేందుకు జ్యుడిషియరీ అధికారాలు కలిగిన  కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. దీంతో న్యాయం కోసం మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్లెక్కే బాధిత మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హయాంలో మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా త్రిపురాన వెంకటరత్నం నియామకమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఒకే మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగింది. 
మూడేళ్ల నుంచి మహిళా కమిషన్ కు ఖాళీ

చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటరత్నం పదవీ కాలం 2017 జులైలో ముగిసింది. అప్పటినుంచి తెలంగాణలో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాసిరెడ్డి పద్మను నియమించినప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఆ వైపుగా చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివిధ సమస్యలపై 2017లో 232 ఫిర్యాదులు రాగా, 2018లో 215, ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలాఖరు వరకు 201 ఫిర్యాదులు అందాయి. గత ఏడాది వచ్చిన ఫిర్యాదుల్లో 49 పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, ఈ ఏడాది అందినవాటిలో 89 ఫిర్యాదుల వరకు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు ఉండగా తెలంగాణలో మాత్రమే పూర్తి స్థాయి మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం గమనార్హం. వివిధ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవులను భర్తీ చేస్తున్న సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైకోర్టు న్యాయవాది ఒకరు మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించాలని హైకోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారుమహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో సిబ్బంది ఆఫీసుకే పరిమితమవుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను తీసుకుని కౌన్సిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించి పంపిస్తున్నారు. కొన్ని ఫిర్యాదులను పోలీసులకు, మరికొన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భరోసా, సఖి కేంద్రాలకు సిఫార్సు చేస్తున్నారు. రాష్ట్రానికి మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండి ఉంటే మహిళలపై జరిగే వేధింపులు, హింసపై వెంటనే స్పందించడం, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సమీక్షలు నిర్వహించడం, వారికి న్యాయం చేసేందుకు  ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడడం సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని చేసే ఓ ఉద్యోగి వెల్లడించారుఇటీవల సంచలనం సృష్టించిన దిశ హత్యపై జాతీయ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆమె హత్యను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సందర్భంగా రాష్ట్రంలో మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంపై కూడా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలతోనైనా రాష్ట్ర ప్రభుత్వమేల్కొని మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో నియమించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి

No comments:

Post a Comment