మంత్రాలయం డిశంబర్ 06 (way2newstv.in)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతిని మంత్రాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాసేన, కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్ దళిత కుల సంఘాలు సమైక్యంగా అంబెడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఘనంగా అంబేద్కర్ 63వ వర్ధంతి
ఈ సందర్భంగా మంత్రాలయం మండల అధ్యక్షుడు రాజన్న మంత్రాలయం టౌన్ అధ్యక్షుడు డేవిడ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.కెవిపిఎస్ మండల కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ దళితుల ఐక్యత కలిగి ఉండి రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీ చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు.. ఈ కార్యక్రమంలో వెంకట ప్రసాద్. మాణిక్యం ఈరన్న.శేఖర్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment