Breaking News

28/12/2019

ప్రజావినతులను . . . సత్వరమే పరిష్కరించండి కలెక్టరు జి . వీరపాండియన్

కర్నూలు, డిసెంబర్ 28 (way2newstv.in)
ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టరు జి . వీరపాండియన్ జిల్లా అధికారులకు సూచించారు . శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9:30 నుండి 10: 30 గంటల వరకు ఫోన్ ద్వారా ప్రజలనుండి వచ్చిన 30 సమస్యలను విన్నారు, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించారు. డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమానంతరం జిల్లా కలెక్టరు జి . వీరపాండియన్ జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడుతూ డయల్ యువర్ కలెక్టరు మరియు స్పందన, ఎస్సీ - ఎస్టీ  గ్రీవెన్సీ కార్యక్రమాలలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులందరూ సీరియస్ గా తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. 
ప్రజావినతులను . . . సత్వరమే పరిష్కరించండి  కలెక్టరు జి . వీరపాండియన్

స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా స్థాయి అధికారులు సర్వం సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ పై కమిటీ వేశామన్నారు. ఎన్నికల ప్రతి పనికి నోడల్ అధికారులు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి లో వచ్చే అవకాశలు కలవన్నారు. ఇపుడు చేసే పని కన్నా అదనంగా మరింత ఎన్నికల పై పని చేయాలన్నారు. ఎలక్షన్ వర్క్ వెంటనే స్టార్ట్ చేయాలన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఏ పని చేయాలేరని, వెంటనే అన్ని వర్కులు గ్రౌండ్ లో ఉండాలన్నారు. ఏ వర్క్ అయిన ఈ నెల చివరిలోగా పనులు చేపట్టాలన్నారు. అలాగే శిలాపలకల ప్రారoబోత్సవలు వెంటనే చేయాలన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నందవరం చెందిన ప్లాట్ నెంబర్ 390 గతంలో పట్ట ఇచ్చారని, 15 ఏళ్లు ముందే ఇంటిని నిర్మించుకున్నామని, కొంత మంది వచ్చి తమ ఇంటిని పగలకొట్టరని కలెక్టర్ కు తెలపడంతో వెంటనే విచారణ చేపట్టాలని డి ఆర్ ఓ పుల్లయ్య కు ఆదేశించారు. ఆదరణ 2 పధకం సంబంధించి డి డి కట్టమని, కాని ఇంత వరకు ఆదరణ పరికిరాలు రాలేదని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధించిన అధికారి వెంటనే సమస్య పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు - 2 సయ్యద్ ఖాజామోహిద్దీన్, డిఆర్ ఓ పుల్లయ్య, తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment