Breaking News

30/12/2019

దూకుడు పెంచిన మమత

బెంగాల్, డిసెంబర్ 30, (way2newstv.in)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫుల్ జోష్ లో ఉన్నారు. బీజేపీకి వరస దెబ్బలు తగలడంతో మమతలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడాదిలో ఐదు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో మమత బెనర్జీ తిరిగి పశ్చిమ బెంగాల్ లో తమదే విజయం అన్న ధీమా పెరిగింది.ఈ రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పొంతన లేదు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ అధిక స్థానాలను గెలుచుకోవడంతో మమత బెనర్జీలో ఆందోళన మొదలయింది. అందువల్లే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. 
దూకుడు పెంచిన మమత

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్సార్సీ విషయంలో మమత బెన్జర్జీ కేంద్రాన్ని కడిగి పారేస్తున్నారు. కోల్ కత్తా పురవీధుల్లో మమత స్వయంగా బలప్రదర్శన నిర్వహించారు.ఎన్సార్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ముఖ్యమంత్రి స్థాయిలో మమత బెనర్జీ పిలుపునిచ్చారు. గవర్నర్ ను సయితం లెక్క చేయడం లేదు. గవర్నర్ కు ఎన్సార్సీ సెగ తగిలేలా చేశారు. ఎన్సార్సీని వ్యతిరేకించాలంటూ అన్ని రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులకు మమత పిలుపునిచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకుని మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలకు వెళ్లాలన్నది మమత బెనర్జీ వ్యూహంగా ఉంది.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారికి మమత బెనర్జీ ఐదు లక్షల నష్ట పరిహారం ప్రకటించారంటే ఆమె ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం అవుతుంది.తాజాగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో మమత బెనర్జీ ఊపిరి పీల్చుకున్నట్లే కనపడుతున్నారు. కానీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో పుంజుకోవడం మాత్రం మమత బెనర్జీ కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ బలం పెంచుకుంటే అది తృణమూల్ కాంగ్రెస్ కే నష్టమని మమతకు తెలియంది కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పశ్చిమబెంగాల్ లో ఈ ఏడాదిలో కాంగ్రెస్ బలపడకూడదు. బీజేపీ పుంజుకోకూడదు. ఇదే లక్ష్యంతో మమత బెనర్జీ ముందుకు వెళుతున్నారు. మొత్తం మీద మమత బెనర్జీలో మునుపటి కంటే రెట్టించి ఉత్సాహం కనపడుతోంది.

No comments:

Post a Comment